న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాయాలు పాలవుతున్న బుమ్రా: అసలు కారణం చెప్పిన కపిల్ దేవ్

Jasprit Bumrah's Bowling Action Attracts Injuries Says Kapil Dev || Oneindia Telugu
‘His action attracts injuries’ - Kapil Dev speaks about Jasprit Bumrah

హైదరాబాద్: టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ శైలి వల్లే అతడు గాయాలు పాలవుతున్నాడని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. మిగతా పేస్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలి ఎంతో ప్రత్యేకం. బౌలింగ్‌ యాక్షన్‌లో చేతిని కంటే అతడు శరీరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడని కపిల్ దేవ్ తెలిపారు.

ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ "ఉదాహరణగా బిషన్‌ బేడీని తీసుకోండి. అతడు బాడీ బౌలర్, అందరి స్పిన్నర్లు లాగా ఆర్మ్‌ బౌలర్‌ కాదు. టెక్నికల్‌గా చెప్పాలంటే అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌. అందుకు కారణం అతడి బౌలింగ్‌ యాక్షన్‌లో ఆర్మ్‌ కంటే బాడీ పాత్ర ఎక్కువగా ఉంటుంది" అని అన్నారు.

నాలోని అతి విశ్వాసమే ఓటమికి కారణం: సెమీస్‌లో కివీస్‌తో మ్యాచ్‌పై కోహ్లీనాలోని అతి విశ్వాసమే ఓటమికి కారణం: సెమీస్‌లో కివీస్‌తో మ్యాచ్‌పై కోహ్లీ

గవాస్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎంతో అద్భుతం

గవాస్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎంతో అద్భుతం

"ఇక, సునీల్‌ గవాస్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. 70 ఏళ్లు వయసు ఉన్నప్పటికీ అతడి బ్యాట్ ఇస్తే అతడి టెక్నిక్ అద్భుతంగానే ఉంటుంది. అయితే, అతడి ఆటను వీరేంద్ర సెహ్వాగ్‌, విశ్వనాథ్ బ్యాటింగ్‌లా ఆస్వాదించలేం. వారి ఆట చూడముచ్చటగా ఉంటుంది" అని కపిల్ దేవ్ అన్నారు.

సచిన్ మరో ఐదేళ్లు ఆడగలడు

సచిన్ మరో ఐదేళ్లు ఆడగలడు

"సచిన్‌ టెండూల్కర్‌ను తీసుకోండి, మరో ఐదేళ్ల వరకు ఆడగలడు ఎందుకంటే అతడి టెక్నిక్‌ బాగుంటుంది. బౌలింగ్‌లో కూడా సాంకేతికంగా గొప్పగా ఉంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగలరు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌లో శరీరాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అతడికి గాయాలు ఎక్కువగా అవుతున్నాయి" అని స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్ వెల్లడించారు.

భువీ సైతం తన శరీరాన్నే

భువీ సైతం తన శరీరాన్నే

"భువనేశ్వర్ (కుమార్) లాంటి బౌలర్ తన శరీరాన్ని ఉపయోగిస్తున్నందున ఎక్కువ కాలం ఆడతాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కాకుండా బౌన్సర్లు సంధించడానికి భారత బౌలర్లు ఇష్టపడతారు. దీనివల్ల వికెట్లను పొందలేరు. కానీ, మహ్మద్‌ షమి అలా కాదు. అతడు విదేశాల్లోనూ చక్కని బంతులు సందిస్తాడు" అని కపిల్‌ దేవ్‌ అన్నారు.

న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులోకి

న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులోకి

దక్షిణాఫ్రికాతో పర్యటనకు ముందు వెన్నునొప్పి గాయంతో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఒత్తిడి కారణంగా అతడి వెన్నులో కింది వైపున చీలిక వచ్చిందని వైద్యులు తేల్చారు. దీంతో స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండిస్ పర్యటనలకు దూరమయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Story first published: Thursday, November 28, 2019, 17:36 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X