For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరింత ఆలస్యం కానున్న టీమిండియా కొత్త కోచ్ ఎంపిక!

Team India New Head Coach Selection To Be Late!! | Oneindia Telugu
 Hiring process for new head coach of India team may get delayed

హైదరాబాద్: టీమిండియా కొత్త హెడ్ కోచ్‌ నియామకం మరింత ఆలస్యం కానుందా? అంటే అవుననే అంటున్నారు. కోచ్‌ల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీని జులై 30గా బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కోచ్‌ను ఎంపిక చేయనుంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు. అయితే, కొత్త కోచ్‌ని ఎంపిక చేయనున్న క్రికెట్ సలహా కమిటి(సీఏసీ)కి బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.

దీని కారణంగా కోచ్ ఎంపిక మరింత ఆలస్యం కానుంది. "కొత్తగా ఎన్నికైన సీఏసీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం గురించి స్పష్టనివ్వలేదు. దీంతో కొత్త కోచ్‌ నియామకం మరింత ఆలస్యం కావచ్చు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు కామెంటేటర్లు, కోచ్‌లుగా లేదా అకాడమీని నడుపుతున్నా వాళ్లే. ఇప్పటికైతే ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు" అని తెలిపారు.

వెస్టిండిస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి, అతని బృందం పదవీ కాలాలన్ని బీసీసీఐ 45 రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆఖరి నిమిషంలో టీమిండియా మాజీ మేనేజర్ లాల్‌ఛంద్ రాజ్‌పుత్ కూడా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. 2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. భారత్‌ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన రాజ్‌పుత్‌ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

Story first published: Wednesday, July 31, 2019, 19:01 [IST]
Other articles published on Jul 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+