పాట గుర్తుకురాలేదని మ్యాచ్ ఆపించిన సెహ్వాగ్
హైదరాబాద్: బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట గుర్తుకురాలేదని టెస్టు మ్యాచ్‌ని మధ్యలో ఆపించేశాడట టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. నిజమండీ. ముంబైలో గోరెగావ్ స్పోర్ట్స్ క్లబ్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సెహ్వాగ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్ తన క్రికెట్ కెరీర్‌లో రెండో ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీకి ఫ్యాన్స్ సైతం పులకించి పోయారు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం గురించి సెహ్వాగ్ వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లోనే తాను 300 పరుగులపై బ్యాటింగ్ చేస్తుండగా సడెన్‌గా తాను పాడుతున్న 'తూ జానే నా' పాట లిరిక్స్ గుర్తు రాలేదట. దీంతో వెంటనే అప్పుడు 12వ ప్లేయర్‌గా ఉన్న ఇషాంత్‌శర్మను మైదానంలోకి పిలిచి తన ఐపాడ్‌లో ఆ పాట ఉందని, ఐపాడ్‌ను తీసుకురావాల్సిందిగా సెహ్వాగ్ చెప్పాడట.

లిరిక్స్ గుర్తుకు రాలేదు
‘‘ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ ‘తూ జానే నా' పాట పాడుతుండగా లిరిక్స్ గుర్తుకు రాలేదు. దీంతో 12వ ఆటగాడైన ఇషాంత్‌ను పిలిపించాను. లిరిక్స్ కోసం నా ఐపాడ్ తెమ్మన్నాను. అతను ఐపాట్‌ని తీసుకొచ్చాడు. అందరూ నేను అతణ్ని డ్రింక్స్ కోసం పిలిచాననుకున్నారు. 12వ ఆటగాడు కొన్నిసార్లు ఇలా కూడా ఉపయోగపడతాడు'' అని వీరూ తెలిపాడు.

షోయబ్ అక్తర్‌ను ఎదుర్కొనే సమయంలో
ఇక పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను ఎదుర్కొనే సమయంలో ఏ పాట పాడేవాడివని అడిగితే ఆ దేఖే జరా.. కిస్మే కిత్‌నా మై దమ్.. అనే పాట అని ఠక్కున సమాధానమిచ్చాడు సెహ్వాగ్. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘‘ప్రతి బంతినీ ఎదుర్కొనే ముందు దాన్ని ఫోరో సిక్సో బాదాలన్న ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మళ్లించడానికే పాట పాడుతుంటా'' అని సెహ్వాగ్ చెప్పాడు.

ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ఇటీవలే ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దపై సెహ్వాగ్ అద్భుతమైన పంచ్ వేశాడు. బ్యాచిలరే ఇలాంటి మార్పు తీసుకురాగలడు. పెళ్లయిన వ్యక్తి ఇంటికి కూరగాయలు తేవడమో.. కుక్కను వాక్‌కు తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేడు అని తనదైన శైలిలో ట్వీట్ పోస్టు చేశాడు.

అంపైర్‌తో వాగ్వాదానికి దిగేవాడిని కాదు
అంతేకాదు తన పెళ్లి జీవితంపై కూడా ఇలాంటి జోకే వేశాడు. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగేవాడిని కాదు. ఎందుకంటే అంపైర్ మనల్ని ఎప్పుడైనా ఔట్ ఇవ్వొచ్చు. అలాగే ఇప్పుడు భార్యతోనూ వాదించను. అంపైర్ ఎప్పటికైనా దానిని మరచిపోతాడేమో కానీ.. భార్య మాత్రం మరవదు అంటూ ఇటీవల మధ్య కాలంలో ట్విట్టర్‌లో రెచ్చిపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications