Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డాట్ బాల్ కి మూడు ప‌రుగులు.. క్లాసిక్ అంటూ వ్యాఖ్య‌త‌ కామెంట్!

Hilarious mixup- One dot ball-three runs-Video goes viral on social media

ఒక బంతికి మూడు ప‌రుగులు రావ‌డం స‌హ‌జం.. కానీ డాట్ బాల్‌కు మూడు ప‌రుగులు రావ‌డం ఎప్పుడైనా చూశారా! అవును మీరు వింటున్న‌ది నిజ‌మే. చెక్ రిప‌బ్లిక్ లీగ్‌లో భాగంగా ప్రేగ్ బార్బేరియ‌న్స్ వినోహ్రాడి మ‌ధ్య జ‌రిగి మ్యాచ్‌లో డాట్ బాల్‌కి బ్యాట్సెమెన్స్ ప‌రుగులు సాధించారు. ఇది కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక దీనిని ప్ర‌సార ఛాన‌ల్ ECN వ్యాఖ్యాత ఓ క్లాసిక్ అంటూ కామెంట్ చేశారు.

బంతిని అందుకోలేక మూడు ప‌రుగులు స‌మ‌ర్పయామి..!

బంతిని అందుకోలేక మూడు ప‌రుగులు స‌మ‌ర్పయామి..!

ఇక ఇరుజ‌ట్ల పోరులో భాగంగా ప్రేగ్ బార్బేరియ‌న్స్ తొలుత బ్యాటింగ్ కి చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లో వినోహ్రాడి బౌల‌ర్ అర్షద్ హయత్ బౌలింగ్‌లో వైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బంతిని.. బార్బేరియన్స్ బ్యాటర్ జహనూర్ హోక్ ​​మిస్ చేశాడు. కీప‌ర్ వెంట‌నే బంతిని అందుకుని ఆర్మ్‌త్రోతో స్టంప్ ఔట్ కూ ప్ర‌య‌త్నించారు. కానీ మిస్ ఫైర్ అవ‌డంతో బ్యాట‌ర్లు ప‌రుగు కోసం పరిగెత్తారు. దీంతో వెంట‌నే అవ‌త‌లి ఎండ్‌లో ఉన్న బౌల‌ర్‌కి.. ర‌నౌట్ కోసం కీపర్ బంతిని విసిరాడు. దానిని అందుకోవ‌డంలో బౌల‌ర్ విఫ‌ల‌కావ‌డంతో మ‌రో ప‌రుగు వ‌చ్చింది. అనంత‌రం ర‌నౌట్ కోసం బౌల‌ర్.. వికెట్లను ప‌డ‌గొట్టేందుకు బంతిని విస‌ర‌గా దానిని అందుకోవ‌డంలో కీప‌ర్ మ‌రోసారి విఫ‌ల‌మ‌వ‌డంతో మ‌రో ప‌రుగుకు వ‌చ్చింది.

బ్యాట్ గ్రౌండ్ చేసి ఉంటే 4 ప‌రుగులు వ‌చ్చేవి: బ్రాడ్ హాగ్

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా డాట్ బాల్‌కు మూడు ప‌రుగులు రావ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌సార ఛాన‌ల్ ECN వ్యాఖ్యాత దీనిని ఓ క్లాసిక్ అంటూ కామెంట్ చేయ‌డం గ‌మ‌న్హారం.ఇక ఆస్ట్రేలియన్ మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ ఈవిష‌యంపై వ్యంగ్యంగా స్పందించాడు. బార్బేరియన్స్ బ్యాటర్ ఆండ్రూ సిమ్ తన పరుగులు పూర్తి చేస్తున్నప్పుడు.. బ్యాట్‌ను గ్రౌండ్ చేయలేదని.. చేసి ఉంటే నాలుగు పరుగులు వ‌చ్చేవ‌ని అన్నాడు.

వినోహ్రాడి జ‌ట్టు సునాయ‌స విజ‌యం ..

వినోహ్రాడి జ‌ట్టు సునాయ‌స విజ‌యం ..

ఇక నిర్ణిత 10 ఓవ‌ర్లలో బార్బేరియ‌న్స్ జ‌ట్టు 85 ప‌రుగులు చేసింది.ఆ జ‌ట్టులో ముర‌ళీ వంద్రాసీ 37 ప‌రుగుల‌తో టాప్ స్కోర్ చేశాడు. సిమ్ 18 ప‌రుగుల‌తో ఫ‌ర్వాలేద‌నిపించాడు. వినోహ్రాడి బౌల‌ర్ల‌లో జోకోప్ ఓ వికెట్ తీయ‌గా.. హ‌య‌త్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం వినోహ్రాడి జ‌ట్టు 86 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 9.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. కైల్ గిల్హామ్ 28 పరుగులతో రాణించాడు. కెప్టెన్ వెంకటేష్ మార్గశయం 12 పరుగులతో త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశాడు. బార్బేరియన్స్ బౌల‌ర్ల‌లో పంకజ్ పుండిర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు

Story first published: Friday, June 10, 2022, 16:40 [IST]
Other articles published on Jun 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+