ఆలూ కూరలా: ట్విట్టర్‌లో అశ్విన్‌పై సెహ్వాగ్ ట్వీట్ ఇదే
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హ్యూమర్ ఎలాంటిదో మనకు తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కామెంటేటర్‌గా తనదైన శైలిలో సరదా ట్వీట్లతో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఐసీసీ వార్షిక అవార్డుల్లో అశ్విన్ పంట పడింది. ప్లేయర్‌గా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్ఠాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌నూ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో అశ్విన్‌కు అభినందనలు తెలిపాడు.
అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచినందుకు శుభాకాంక్షలు అశ్విన్. ఆలూ కూరలా అన్ని సందర్భాల్లోనూ అడ్జస్ట్ అవుతున్నావంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు అత్యుత్తమ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

12వ ఆటగాడు
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) తర్వాత ప్రతిష్ఠాత్మక ట్రోఫీని సాధించిన మూడో భారత క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా 12వ ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. 2004లో ద్రవిడ్ తర్వాత ఒకే ఏడాదిలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

గతంలో ఈ అవార్డుని కైవసం చేసుకున్న వారు వీరే
గతంలో కలిస్ (2005), రికీ పాంటింగ్ (2006), కుమార సంగక్కర (2012), మైకేల్ క్లార్క్ (2013), మిచెల్ జాన్సన్ (2014), స్టీవ్ స్మిత (2015)లు ఒకే ఏడాది ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకున్నారు. 2015, సెప్టెంబర్ 14 నుంచి 2016, సెప్టెంబర్ 20 మధ్య ప్రదర్శన ఆధారంగా జరిగిన ఓటింగ్ ద్వారా అవార్డులను ప్రకటించారు.

8 టెస్టులాడిన అశ్విన్ 8 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టాడు
కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8 టెస్టులాడిన అశ్విన్ 8 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టడంతోపాటు 336 పరుగులు సాధించాడు. 19 టీ20ల్లో 27 వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా 2015ను ముగించిన అశ్విన్, 2016లో కూడా నెంబర్ వన్ ర్యాంక్‌ని కైవసం చేసుకున్నాడు.

ఈ అవార్డు కుటుంబానికి అంకితం
‘ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. సచిన్, ద్రావిడ్ లాంటి దిగ్గజాల అడుగుజాడల్లో నడవడం నాకు గర్వకారణం. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా నెగ్గడం ఆనందాన్ని రెట్టింపు చేసింద'ని అశ్విన్ అన్నాడు. ‘నా విజయం వెనుక ఎంతో మంది కృషి ఉంది. వారికి కృతజ్ఞతలు. రెండేళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. ఈ ఏడాది మరింత ప్రత్యేకం. బౌలింగ్ ఎంతో మెరుగ్గా ఉండగా.. బ్యాట్‌తోనూ జట్టు అవసరాల మేరకు సహకరించాన'ని రవిచంద్రన్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications