For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి ఓవర్లో హైటెన్షన్..మ్యాచ్ మధ్యలోనే వచ్చేయండంటూ పంత్ సీరియస్..ఆఖరికి రాజస్థాన్ రాయల్స్ విజయం

hightension match.. last over drama, finally rr win

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో హైడ్రామా నడిచింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్‌మెన్ పావెల్ భీకరంగా చెలరేగాడు. మెక్ కాయ్ వేసిన ఆ ఓవర్లో తొలి మూడు బంతులకు 3సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి రాజస్థాన్ ప్లేయర్ ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్‌ను అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది నోబాల్ అని.. చెస్ట్ వరకు బాల్ ఫుల్‌టాస్ వచ్చిందంటూ పావెల్ అంపైర్‌తో చర్చిస్తుండగా అంపైర్ ఒప్పుకోలేదు.

దీంతో డగౌట్లో కూర్చున్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ సీరియస్ అయ్యాడు. ఇంకా క్రీజులో ఉండొద్దు.. వచ్చేయండంటూ డగౌట్ నుంచి సిగ్నల్ ఇస్తూ ఫైర్ అయ్యాడు. అలాగే ఢిల్లీ టీంమేట్స్ అందరూ కూడా పూర్తి అసహనంతో కన్పించారు. రిప్లేలో కూడా కాస్త నోబాల్ లాగే కన్పించడం గమనార్హం. అయితే కాసేపటికే సద్దుమణిగిన ఈ వివాదం అనంతరం మెక్‌కాయ్ చివరి మూడు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. చివరి బంతికి పావెల్‌ను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం.. 15పరుగుల తేడాతో గెలుపొందింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. జోస్ బట్లర్ (116పరుగులు 65బంతుల్లో 9ఫోర్లు, 9సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (54పరుగులు 35బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) , కెప్టెన్ సంజూ శాంసన్ (46పరుగులు 19బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు నాటౌట్) చెలరేగడంతో 222పరుగుల భారీ స్కోరు సాధించింది. 223పరుగుల భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ కూడా దీటుగా పోరాడింది. ఢిల్లీ ప్లేయర్లలో పృథ్వీ షా (37పరుగులు 27బంతుల్లో), డేవిడ్ వార్నర్ (28పరుగులు 14బంతుల్లో), రిషబ్ పంత్ (44పరుగులు 24బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), లలిత్ యాదవ్ (37పరుగులు 24బంతుల్లో) రాణించారు.

hightension match.. last over drama, finally rr win

ఆఖర్లో రోవ్‌మెన్ పావెల్ (36పరుగులు 15బంతుల్లో 5సిక్సర్లు) భీకరంగా చెలరేగాడు. పావెల్ మూమెంట్ చూస్తే ఢిల్లీని గెలిపించేలా కన్పించాడు. కానీ నోబాల్ వివాదం వల్ల అతని ఏకాగ్రత దెబ్బతిన్నట్లు కన్పించింది. దీంతో తన మూమెంట్ కోల్పోవడం, చివరి బంతికి ఔటవ్వడంతో 15పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో 5మ్యాచ్‌లు గెలిచిన ఆర్ఆర్.. 10పాయింట్లతో +0.432 నెట్ రన్‌రేట్‌తో కొనసాగుతోంది.

పంచ్ సూపర్ స్ట్రైకర్ అవార్డ్ : సంజూ శాంసన్
డ్రీమ్ 11 గ్రేమ్ ఛేంజర్ అవార్డ్ : జోస్ బట్లర్
క్రాకింగ్ సిక్సెస్ అవార్డ్ : జోస్ బట్లర్
పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : డేవిడ్ వార్నర్
మోస్ట్ వాల్యూబుల్ అసెట్ అవార్డ్ : జోస్ బట్లర్
ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డ్ : ప్రసీద్ క్రిష్ణ
రూపే ఆన్ ది గో ఫోర్ అవార్డ్ : జోస్ బట్లర్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : జోస్ బట్లర్

Story first published: Saturday, April 23, 2022, 0:02 [IST]
Other articles published on Apr 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+