ఐపీఎల్ ఫైనల్: భర్తతో కలిసి మ్యాచ్ వీక్షించిన కేసీఆర్ తనయ (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్‌లో టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి తెలుగు రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి మ్యాచ్‌ని వీక్షించింది. మరోవైపు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖలు కూడా హాజరయ్యారు.

పూణె విజయ లక్ష్యం 130
130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో పూణె విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. దీంతో చివరి ఓవర్‌ను ముంబై బౌలర్ మిచెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

చివరి బంతికి నాలుకు పరుగులు
9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు మాత్రమే చేశారు. అయితే మూడు పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. లేకుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది.

రాణించిన స్మిత్ 51, రహానే 44
పూణె ఆటగాళ్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 51, రహానే 44 పరుగులతో రాణించినా జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ విజయంతో ఈ సీజన్‌లో లీగ్ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్‌లో ఒకసారి ఓటమి పాలైన ముంబై... పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేసినట్లు అయింది.

నిరాశపరిచిన ముంబై బ్యాట్స్‌మెన్
హైదరాబాద్ వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్ మెన్ నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పూణె బౌలర్లు ఉనాద్కత్ (2/11), ఆడమ్ జంపా (32/2) ధాటికి ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

ఒకే ఒక్కడు కృనాల్ పాండ్యా
దీంతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ విజయ లక్ష్యం 130 పరుగులుగా నిర్దేశించింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3x4, 2x6), రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4x4) మాత్రమే ముంబై జట్టులో చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (4), సిమన్స్ (3)లను ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జయదేవ్ ఆదిలోనే ముంబైకి షాకిచ్చాడు.

అంబటి రాయుడు రనౌట్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (12) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ దశలో కృనాల్ పాండ్యాతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో నిలిచింది.

ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయిన పొలార్డ్
రోహిత్ ఔట్ అనంతరం వచ్చిన హిట్టర్ పొలార్డ్ (7) సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (10), కర్ణ్‌శర్మ (1) కూడా నిరాశపరచడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో కృనాల్ పాండ్యా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టడంతో ముంబై 129 పరుగులైనా చేయగలిగింది.

తొలి ఐదు ఓవర్లలో ఒక బౌండరీ కూడా లేదు
పుణె బౌలర్ల ధాటికి ముంబై ఇండియన్స్ తొలి ఐదు ఓవర్లలో కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేదు. పూణె బౌలర్లలో జయ్‌దేవ్ ఉనాద్కత్, ఆడమ్ జంపా, డానియేల్ క్రిస్టియన్ తలో రెండు వికెట్లు తీయగా రెండు రనౌట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications