రెండో వన్డే హైలెట్స్: నమోదైన రికార్డులివే (ఫోటోలు)
హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
ధోని సైతం 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించడం విశేషం. ఇక ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.
వీరిద్దరి విజృంభణతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 381 పరుగులు చేసింది. అనంతరం 382 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది. ఈ వన్డేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు.

ఆరేళ్ల తర్వాత యువరాజ్ సెంచరీ:
2011 వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ సింగ్ సెంచరీ సాధించాడు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం యువరాజ్ సెంచరీ సాధించాడు. యువరాజ్‌కి తన కెరీర్‌లో ఇది 14వ సెంచరీ. ఆ తర్వాతి 17 ఇన్నింగ్స్‌ల్లో అతని సగటు 18.32 మాత్రమే.
2011 వరల్డ్ కప్ తర్వాత కటక్‌లో సెంచరీ చేసిన యువీ

కెరీర్‌లో పదో సెంచరీ చేసిన ధోని:
కటక్ వన్డేలో ధోని 134 పరుగులతో సెంచరీ సాధించాడు. ధోనికి ఈ సెంచరీ పదో సెంచరీ కావడం విశేషం.

నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం:
నాలుగో వికెట్‌కు యువరాజ్-ధోనిల జోడీ 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే చరిత్రలో ఇంగ్లాండ్‌పై ఇదే నాలుగో వికెట్‌కు రెండో అత్యుత్తమం. 1998లో జడేజా, అజహరుద్దీన్ జింబాబ్వేపై అజేయంగా 275 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ధోని 200 సిక్సులు:
కటక్ వన్డేలో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న ధోని తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. రెండో వన్డేలో ధోని 200 సిక్సర్లు మైలురాయిని అందుకున్నాడు. 48 ఓవర్లో ప్లంకెట్‌ను ధోని మూడు సిక్సర్లు కొట్టడంతో ఈ ఘనతను సాధించాడు.
200: రెండో వన్డేలో సరికొత్త రికార్డు సృష్టించిన ధోని

ఐదో వన్డే సిరిస్ విజయం
స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయం. భారత పర్యటనలో భారత్‌పై ఇంగ్లాండ్ ఒకే ఒక సిరిస్ 1984-85లో గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications