Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌‌పై విజయం తర్వాత కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్..!

Highest Winning Percentage In T20I Record is on the Name Of Rohit Sharma After India defeat Pak

ఆసియా‌కప్ మెగా టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్వితీయ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్ అసలైన క్రికెట్ పసందును క్రికెట్ అభిమానులకు అందించింది. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు విజయం అంత సులువుగా ఏం రాలేదు. చివరి ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది.

ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే అందుకు ఒకే ఒక్క మెయిన్ రీజన్ హార్దిక్ పాండ్యా. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి తనదైన స్టైల్లో మ్యాచ్ విజయ లాంఛనాన్ని హార్దిక్ పూర్తి చేశాడు. ఇకపోతే ఈ మ్యాచ్ విజయం ద్వారా రోహిత్ శర్మ ఖాతాలో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డు నమోదైంది. టీ20ల్లో 30కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 36 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 30 మ్యాచ్‌లు ఇండియా గెలిచింది. 6 మ్యాచ్‌లు ఓడిపోయింది. తద్వారా కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజీ 83.33తో అత్యధిక విజయ శాతం ఉన్న కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ నాయకత్వంలో భారత్ అప్రతిహత విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే.

అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ ఉన్న కెప్టెన్లు (30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ - 83.3%
ఆప్ఘన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ - 80.8%
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ - 62.5%
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ - 59.2%
భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ - 58.6%
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ - 55.6%
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ - 51.7%

Story first published: Tuesday, August 30, 2022, 9:27 [IST]
Other articles published on Aug 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+