Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsPAK: ఇంగ్లండ్, పాకిస్తాన్ టీ20ల్లో.. దుమ్ములేపిన బ్యాటర్లు, బౌలర్లు ఎవరంటే?

highest wicket takers and top run getters in ENGvsPAK T2oIs

టీ20 ఫార్మాట్‌లో కొత్త కింగ్ ఎవరో తేల్చేసే సమయం వచ్చేసింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లలో ఒకటి ఈ సింహాసనంపై కూర్చునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ ఫార్మాట్‌లో ఇటీవలి చరిత్ర చూసుకుంటే ఇంగ్లండ్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ విషయంలో ఏ అంశాన్ని సులభంగా తీసుకోకూడదు. జింబాబ్వే చేతిలో ఓడిపోవాలన్నా.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిల్యాండ్‌ను చిత్తు చేయాలన్నా ఆ జట్టుకే సాధ్యం.

క్రికెట్ అవే కదా కీలకం..

క్రికెట్ అవే కదా కీలకం..

ఎన్ని జట్లు, వేదికలు మారినా.. క్రికెట్ అనేది బ్యాటుకు, బంతికి జరిగే పోటీ. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? అనేదే ముఖ్యం. ఈ రెండు జట్లలో ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే రెండు జట్లలో బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. అందుకే ఈ మ్యాచ్ విజేతను నిర్ణయించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలోనే అసలు ఇప్పటి వరకు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల వివరాలు ఒకసారి గమనిద్దాం.

అత్యథిక వికెట్లు స్పిన్నర్లకే..

అత్యథిక వికెట్లు స్పిన్నర్లకే..

ఇంగ్లండ్, పాకిస్తాన్ రెండు జట్ల వద్ద ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. గతంలో కూడా ఈ జట్లు స్పిన్‌కు జట్టులో ప్రత్యేక స్థానం ఇచ్చాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్పిన్నర్లే అగ్రస్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ మాజీ లెజెండ్ గ్రేమ్ స్వాన్ 17 వికెట్లతో ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో అదిల్ రషీద్ (17), స్టువర్ట్ బ్రాడ్ (15), హారిస్ రవూఫ్ (14), షహీన్ అఫ్రిదీ (13) ఉన్నారు.

బ్యాటర్ల దుమారం..

బ్యాటర్ల దుమారం..

ఈ రెండు జట్లలో కూడా అద్భుతమైన బ్యాటర్లు కూడా ఉన్నారు. వాళ్లు ఇంతకుముందు ఈ జట్లు తలపడినప్పుడు ఊరికినే కూర్చోరు కదా. ముఖ్యంగా పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (560), మహమ్మద్ రిజ్వాన్ (522) ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ మాజీ సారధులు ఇయాన్ మోర్గాన్ (427), కెవిన్ పీటర్సన్ (348), మహమ్మద్ హఫీజ్ (324) ఉన్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏడు టీ20ల సిరీస్‌లో బట్లర్, హేల్స్ వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. కాబట్టి వాళ్లను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఈ సిరీస్‌లో బాబర్, రిజ్వాన్ ఇద్దరూ ధాటిగా ఆడారు.

Story first published: Sunday, November 13, 2022, 13:47 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+