ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ టాప్ స్కోర్ నమోదు చేసిన జట్లు ఇవే

Posted By:
Highest totals in IPL history: Kolkata Knight Riders slam 245/6, highest total in Indian Premier League 2018

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 11వ సీజన్ లోనూ యువ ఆటగాళ్ల అరంగ్రేటంతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఇరగదీశేస్తున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ దశ నుంచి తప్పుకున్న 2 జట్లతో లీగ్ దాదాపు సగానికి పైగా పూర్తయింది.

కోల్‌కతా బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. సునీల్ నరైన్ (36 బంతుల్లో 75) మెరుపు ఆరంభానికి రస్సెల్ 14 బంతుల్లో (31), దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో (50) విధ్వంసం తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నరైన్ ఐపీఎల్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్కోరు సాధించిన వేళ.. నైట్‌రైడర్స్ ఈ ఐపీఎల్‌ సీజన్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది.

ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టు 2013లో పూణె వారియర్స్‌పై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. తర్వాతి స్థానం కూడా బెంగళూరుదే. గుజరాత్ లయన్స్‌పై 2016లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 248 రన్స్ చేసింది. మూడో స్థానంలో ధోనీ సేన ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై 2010లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

శనివారం నాటి కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగోస్థానంలో ఉంది. ఐదోస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 2008లో పంజాబ్‌పై ఐదు వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. అంటే టాప్-5లో ఆర్‌సీబీ, చెన్నై రెండేసి సార్ల చొప్పున చోటు దక్కించుకోగలిగాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, May 13, 2018, 14:05 [IST]
Other articles published on May 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more