West Indies vs Bangladesh 1st Test : మూడోసారి ఆల్ టైం చెత్త రికార్డును నమోదు చేసిన బంగ్లాదేశ్..!

బంగ్లాదేశ్ అప్పుడప్పుడు దారుణంగా ఆడుతుందని తెలుసు కానీ.. మరీ ఇంత దారుణంగా ఆడుతుందని అనుకోం. బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండు టెస్ట్ సిరస్లో భాగంగా తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆల్‌టైం వరస్ట్ రికార్డ్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టులోని ఆరుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డకౌట్లు (6) అయిన 7వ టీంగా బంగ్లా నిలిచింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 32.5ఓవర్లలో కేవలం 103పరుగులకే బంగ్లాదేశ్ బ్యాటర్లు చాప చుట్టేశారు. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి బంగ్లా షకీబ్ అల్ హసన్ మినహా మిగతావారు క్రీజులో నిలబడ్డానికి కూడా ఇబ్బందిపడ్డారు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (51పరుగులు) హాఫ్ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
బంగ్లాలో డకౌట్ అయిన ఆరుగురు ప్లేయర్లలో ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ శాంటో, మోమినుల్ హక్.. గుండు సున్నాకే ఔటయ్యారు. ఇక నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీద్ అహ్మద్ డకౌట్ అయిన మిగతా ప్లేయర్లు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జైడెన్ చెరో 3వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. ఇక కీమర్ రోచ్, కైల్ మేయర్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డకౌట్లు (6) బంగ్లా జట్టు 3సార్లు అయింది.
ఇక ఈ ఏడాది మే 23న శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ ఈ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. మీర్పుర్ వేదికగా జరిగిన ఆ టెస్ట్‌లో ఆరుగురు ప్లేయర్లు ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఒక్క నెల కూడా కాలేదు.. అప్పుడే మరోసారి బంగ్లా ఈ చెత్త రికార్డును రెండోసారి నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఏడుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం జరిగింది. ఇక ఇటీవలే బంగ్లా కెప్టెన్సీకి మోమినుల్ హక్ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్సీ పగ్గాలు షకీబ్ అల్ హసన్ చేతికొచ్చాయి.
ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్లో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో రోజు 60ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 122పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్ (50పరుగులు 177బంతుల్లో 5ఫోర్లు నాటౌట్) మొండిగా పోరాడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications