రోహిత్ పేరిట ఘోర రికార్డ్.. రోహిత్, కోహ్లీ కాస్త ఫామ్ పుంజుకోండయ్యా.. అభిమానులు హర్ట్ అవుతున్నారు

ఐపీఎల్-2022లో భాగంగా గురువారం డివై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏంటంటే.. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
మొత్తం 14సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. ఐపీఎల్లో రోహిత్ తర్వాత అత్యధికంగా 13సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, రాయుడు ఉన్నారు. ఈ సీజన్లో రోహిత్ శర్మ పూర్తిగా విఫలమవుతున్నాడు.
మార్క్ చూపించలేకపోతున్న రోహిత్
అటు కెప్టెన్ గానూ, ఇటు ప్లేయర్‌గానూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు రోహిత్ కు ఏమైందంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు హోరెత్తిస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌గా ఎదురులేని రోహిత్ శర్మ.. ఐపీఎల్ ఈ సీజన్లో మాత్రం తన కెప్టెన్ మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ ఇప్పుడు అత్యంత పేలవ కెప్టెన్‌గా కన్పిస్తున్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఒకటే బాటలో
ఇక రోహిత్ వ్యక్తి గత ప్రదర్శనను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 114పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఇటీవలే విరాట్ కోహ్లీ సైతం గోల్డెన్ డక్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం తీవ్ర ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. ఈక్రమంలో వీరిద్దరిపై మీమ్స్ వైరలవుతున్నాయి. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్లో ఆడిన ఏడు మ్యాచుల్లో వరుసగా 41, 10, 3, 26, 8, 6, 0 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 41*, 12, 5, 48, 1, 12, 0 పరుగులు చేశాడు.
వరల్డ్ కప్ దగ్గర్లో ఉంది.. కాస్త చూసి ఆడండి
ఐపీఎల్ అనంతరం టీ20 వరల్డ్ కప్ త్వరలోనే జరగబోతుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్ పుంజుకోవాలనే ఉద్దేశంతో ఓ మీమర్ ఈ మీమ్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఐపీఎల్లో ఆడినట్లే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వీరిద్దరూ ఇలాగే ఆడితే టీమిండియాకు గడ్డు పరిస్థితి ఖాయం. మరో మీమర్ నాటు నాటు సాంగ్‌తో కంపేర్ చేస్తూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకే రకమైన ఫామ్‌లో డకౌట్ దిశగా సాగుతున్న ఉద్దేశాన్ని మీమ్‌లో చూపించాడు. వీరి ఫామ్ లేమిని మాత్రం కొందరు అభిమానులు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మళ్లీ రోహిత్, కోహ్లీ ఫాం అందుకోవాలని, ఈ గడ్డు పరిస్థితుల్లో నుంచి బయటపడి మళ్లీ పుంజుకుంటారని.. ప్రస్తుతం టైం బ్యాడ్ మాత్రమే.. ఒక్కసారి వారికి టైమ్ వస్తే పరుగుల వర్షం వస్తుందని పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications