Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార‌త్ వ‌ర్సెస్ పాక్‌: టికెట్లు దొర‌క్క చ‌చ్చేట్టున్నారుగా! బ్లాక్‌లో కొన్న జ‌నం!

High Demand for India-Pakistan ODI match ticket

మాంఛెస్ట‌ర్ సిటీ: భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ అంటే- దాన్ని రెండు దేశాల మ‌ధ్య యుద్ధంలా భావించే అభిమానులు మ‌న‌దేశంలో అడుగ‌డుగునా క‌నిపిస్తారు. ఈ రెండు దేశాల్లో కోట్లాదిమంది క్రికెట్ ప్రియులు టీవీల‌కు క‌ళ్ల‌ప్ప‌గించి చూసే మ్యాచ్ ఇది. ఇక ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నుకునే వారి సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. మాంఛెస్ట‌ర్ సిటీలోని ఓల్డ్ ట్రాఫ‌ర్డ్ స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి కొన్ని ల‌క్ష‌ల‌మంది ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. అదృష్ట‌వంతుల‌కు మాత్ర‌మే టికెట్ వరించింది.

 హాట్ కేకుల్లా టికెట్లు..

హాట్ కేకుల్లా టికెట్లు..

బిగ్గెస్ట్ ఈవెంట్‌కు వేదిక‌గా మారిన ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం సామ‌ర్థ్యం 20 వేలు. అయిన‌ప్ప‌టికీ.. సామ‌ర్థ్యానికి మించిన టికెట్లు అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్ ద్వారా టికెట్ల విక్ర‌యం మొద‌లు పెట్టిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో టికెట్లు హాట్ కేకుల్లా విక్ర‌యం అయ్యాయి. మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో మొత్తం టికెట్ల‌న్నింటిని ఉఫ్ మ‌ని ఊదేశారు అభిమానులు. ఒక్కో టికెట్ ధ‌ర 60 వేల రూపాయ‌ల పైమాటే. అయిన‌ప్ప‌టికీ- ప‌ట్టించుకోలేదు. టికెట్ కొన‌డంపైనే ధ్యాసంతా. ఇక్క‌డో మాల్ ప్రాక్టీస్‌కు సైతం అవ‌కాశం దొరికింది. టికెట్ల‌ను కొన్న వారి వ‌ద్ద నుంచి అధిక మొత్తాన్ని చెల్లించి. వాటిని కొనుగోలు చేసిందో సంస్థ‌. ప్రేక్ష‌కుల వ‌ద్ద నుంచి తాము కొన్న టికెట్ల‌కు మూడింత‌ల ధ‌ర‌ను వ‌సూలు చేసి, అమ్మేసింది.

ధోనీ వీరాభిమానికి సైతం టికెట్లు దొర‌క్క‌..

ధోనీ వీరాభిమానికి సైతం టికెట్లు దొర‌క్క‌..

జార్ఖండ్ డైన‌మేట్ మ‌హేంద్ర సింగ్ ధోనీని విప‌రీతంగా అభిమానించే చాచా చికాగో ఆలియాస్ మ‌హ‌మ్మ‌ద్ బ‌షీర్ సైతం టికెట్లు దొర‌క్క ఇబ్బంది ప‌డ్డారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న మ‌హేంద్ర‌సింగ్ ధోనీ.. తానే స్వ‌యంగా టికెట్ల‌ను కొనుగోలు చేసి, ఆయ‌న‌కు పంపించారు. ఆ టికెట్ల ఖ‌రీదు అక్షరాలా 79 వేల రూపాయ‌లు. అంద‌రికీ అలాంటి వారు దొర‌క‌రుగా. అందుకే- బ్లాక్‌లో టికెట్ల‌ను కొన‌డానికీ వెనుకాడ‌ట్లేదు అభిమానులు. ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూస్తే చాలనుకుంటున్నారు.

టికెట్ల కోసం ఏడు ల‌క్ష‌ల మంది..

ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం సీట్ల సామ‌ర్థ్యం 20 వేలు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను చూడ‌టానికి ఏకంగా ఏడు ల‌క్ష‌ల‌మందికి పైగా అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. 48 గంట‌ల్లోనే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ చోటు చేసుకున్నాయ‌ని స‌మాచారం. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని వెబ్‌సైట్లు బాగానే సొమ్ము చేసుకున్నాయి. సాధార‌ణ రేట్ల‌కు టికెట్ల‌ను కొన్న అభిమానుల వ‌ద్ద నుంచి వాటిని కొనుగోలు చేసి, భారీ రేట్ల‌కు విక్ర‌యించుకుంది. గ‌రిష్ఠంగా కొన్ని టికెట్లు 58 వేల 071 రూపాయ‌ల‌కు అమ్ముడుపోయాయి.

Story first published: Sunday, June 16, 2019, 10:56 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+