కేప్ టౌన్‌లో భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టులో బౌలర్లు చెలరేగుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 153 రన్స్ చేసింది. 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా, ఓవర్ నైట్ స్కోరు 62/3తో రెండో రోజ ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌటైంది.
రెండో రోజు ఆటలో బుమ్రా (6/61) సఫారీ సేనను భయపెట్టాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో బుమ్రా నయా రికార్డు సృష్టించాడు. SENA దేశాల్లో అత్యధి సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా, కపిల్ దేవ్ సరసన నిలిచాడు. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి మార్క్‌రమ్ దూకుడుగా ఆడాడు. 103 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. కఠిన పిచ్‌పై ఇరు జట్ల ప్లేయర్లు హాఫ్ సెంచరీ సాధించడానికి కష్టపడితే.. మార్క్‌రమ్ మాత్రం మాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికాను ఒంటిచేత్తో ఆదుకున్నాడు.

అయితే పేసర్లకు స్వర్గధామంలా మారిన పిచ్‌పై టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ మాత్రం విఫలమయ్యాడు. రబాడ వికెట్ తీసినా మరోసారి ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ప్రసిధ్ వేసిన తొలి ఓవర్‌లో మార్క్‌రమ్ చెలరేగిపోయాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రసిధ్ కృష్ణపై నెట్టింట్లో విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రసిధ్ కృష్ణ పేరు ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. 'హేయ్ ప్రభు.. హేయ్ ప్రసిధ్ కృష్ణ.. జట్టులో ఏం చేస్తున్నావు? మన జట్టు ఎలా గెలవాలి', 'ఆశోక్ దిండా అకాడమీలో ప్రసిధ్ కృష్ణ చోటు సంపాదించుకున్నాడు', 'పాకిస్థాన్ బౌలర్ హరీస్ రవూఫ్ కంటే గొప్పగా బౌలింగ్ చేస్తున్నావు' అంటూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.
కాగా, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్ సెంచరీ చేయగా, డీన్ ఎల్గర్ (12), జేన్సన్ (11) రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన సఫారీ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. బుమ్రా ఆరు వికెట్లు, ముకేశ్ కుమార్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాలంటే 79 పరుగులు చేయాలి.