రాత్రంతా తాగి క్రీజులోకి: 175 బాది మ్యాచ్‌ని గెలిపించాడు
హైదరాబాద్: రాత్రంతా తాగుతూనే ఉన్నాడు. హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతుంటే బ్యాటింగ్‌కు దిగడం దాదాపు అసాధ్యమనే అనుకున్నాడు. కానీ తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగి, ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తుచేసి దక్షిణాఫ్రికాకు చారిత్రక విజయాన్ని అందించి పెట్టాడు హెర్షలే గిబ్స్.
ఈ విషయాన్ని స్వయంగా తన ఆటోబయోగ్రఫీ 'టు ద పాయింట్: ద నో హోల్డ్స్ బార్‌డ్ ఆటోబయోగ్రఫీ'లో పేర్కొన్నాడు. 2006లో జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన వన్డే మ్యాచ్ గురించి చాలా క్లుప్తంగా తన ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించాడు. ఆ వన్డేలో ఆస్ట్రేలియా 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సఫారీల టార్గెట్ 434
అనంతరం 434 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సఫారీలు గిబ్స్ వీరవిహారంతో జయకేతనం ఎగురవేశారు. 111 బంతుల్లో 21 ఫోర్లు 7 సిక్సర్లతో చెలరేగిపోయిన గిబ్స్ ఛేజింగ్‌లో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాకు కలలో కూడా ఊహించని చారిత్రక విజయాన్ని అందించాడు.

ఒక్క వికెట్ తేడాతో ఘన విజయం
క్రికెట్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్‌గా నిలిచిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో ఘన విజయం సాధించారు. అయితే నిజానికి ఆ మ్యాచ్‌లో గిబ్స్ దిగేది అనుమానమే అనుకున్నారు. ఎందుకంటే, ఆ ముందు రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గిబ్స్ మద్యం తాగుతూనే ఉన్నాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా గిబ్స్
అయితే హ్యాంగోవర్‌తో ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగిన గిబ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి అద్భుతం సృష్టించాడు. 43 ఏళ్ల గిబ్స్ తన ఆటోబయోగ్రఫీ ‘టు ద పాయింట్: ద నో హోల్డ్స్ బార్‌డ్ ఆటోబయోగ్రఫీ'లో ఆరోజు జరిగిన దాని గురించి రాసుకొచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కూడా తాగుతూనే ఉన్నానని గిబ్స్ రాసుకున్నాడు.

హ్యాంగోవర్ తలంతా పట్టేసింది
‘ఉదయాన్నే తలంతా పట్టేసింది. హ్యాంగోవర్. ఆడతానో? లేదోనని అనుకున్నా' అని పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే హ్యాంగోవర్‌తోనే వన్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన గిబ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌కు ముందురోజు గిబ్స్ మద్యం సేవించిన విషయాన్ని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ కూడా తన ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించడం గమనార్హం.

హస్సీ కూడా తన పుస్తకంలో
‘నిద్రకు ఉపక్రమించే ముందు నా హోటల్ రూమ్ నుంచి బయటకు చూస్తే గిబ్స్ డ్రింక్ చేస్తూ కనిపించాడు. మరో గంట తర్వాత కూడా అతడు అక్కడి నుంచి కదల్లేదు. దాంతో, ఒక వికెట్ ఆసీ్‌సకు సులభంగా లభించినట్టేనని భావించాన'ని హస్సీ తన పుస్తకంలో వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications