ఆ లీగ్‌లో ఆడితే.. భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది: మాజీ దిగ్గజ క్రికెటర్‌

BCCI Stopping Me From Playing Kashmir Premier League - Herschelle Gibbs || Oneindia Telugu

జోహనెస్‌బర్గ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ సంచలన ఆరోపణలు చేశాడు. బీసీసీఐ తనపై బెదిరింపులకు పాల్పడిదంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు. పాకిస్తాన్‌లో త్వరలో ప్రారంభం కానున్న కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్ 2021)లో ఆడకుండా బీసీసీఐ తనను అడ్డుకుంటోందని ఆరోపణలు గుప్పించాడు. ఒకవేళ కేపీఎల్ 2021లో ఆడితే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్‌ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని హెచ్చరికలు జారీ చేసిందంటూ ట్వీట్ చేశాడు. అయితే గిబ్స్‌ ఆరోపణలపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.

 Tokyo Olympics 2021: షూటింగ్‌లో నిరాశే.. ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించలేకపోయిన అంజుమ్‌, తేజ‌స్విని!! Tokyo Olympics 2021: షూటింగ్‌లో నిరాశే.. ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించలేకపోయిన అంజుమ్‌, తేజ‌స్విని!!

కశ్మీర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు:

ఆగస్టు 6 నుంచి కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్ 2021) సీజన్‌ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ రాజకీయ నాయకుడు షెహ్రియార్ ఖాన్ అఫ్రిది ఈ టోర్నమెంట్ జరగడానికి అసలు కారకులు. ఆయన ఐడియాతోనే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు ముజఫరాబాద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ప్రతి జట్టులో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉంటారు. ఈ ప్రాంతం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో హర్షలే గిబ్స్‌, తిలకరత్నే దిల్షాన్‌ సహా మరికొందరు దిగ్గజ క్రికెటర్లు కూడా ఆడనున్నారు.

బీసీసీఐ బెదిరిస్తోంది:

'ఇది అనవసర విషయం. కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్‌)ను బీసీసీఐ రాజకీయ అంశంతో ముడిపెడుతుంది. నన్ను కేపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ అడ్డుపడుతోంది. ఒకవేళ కేపీఎల్‌ లీగ్‌లో పాల్గొంటే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఎలాంటి క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని బెదిరిస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అభ్యంతరం తెలపడం నాకు నచ్చలేదు. ఈ అంశం నన్ను చాలా బాధించింది' అంటూ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో హర్షలే గిబ్స్‌ 90 టెస్టుల్లో, 248 వన్డేల్లో, 23 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 6167, వన్డేల్లో 8094, టీ20ల్లో 400 రన్స్ చేశాడు.

రషీద్ లతీఫ్ కూడా:

రషీద్ లతీఫ్ కూడా:

గతంలో ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ కూడా కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌ (కేపీఎల్‌)లో పాల్గొనే ఆటగాళ్ల పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు. 'కేపీఎల్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లపై బీసీసీఐ దారుణంగా వ్యవహరిస్తోంది. ఈ లీగ్‌లో మాజీ ఆటగాళ్లు పాల్గొంటే.. భారత క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా లేదా ఏ హోదాలోనైనా పనిచేయడానికి అనుమతించబడరని బోర్డు హెచ్చరిస్తోంది. కేపీఎల్‌లో ఆడిన ప్లేయర్లను భారత్‌లోకి అనుమతించమనడం సమంజసం కాదు' అంటూ రషీద్ లతీఫ్ ట్వీట్ చేశాడు.

కేపీఎల్‌ టోర్నీలో ఆరు జట్లు:

కేపీఎల్‌ టోర్నీలో ఆరు జట్లు:

ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్‌ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఓవర్సీస్‌ వారియర్స్‌, ముజఫర్‌బాద్‌ టైగర్స్‌, రావల్‌కోట్‌ హాక్స్‌, బాగ్‌ స్టాలియన్స్‌, మీర్పూర్‌ రాయల్స్‌, కోట్లీ లయన్స్‌ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షాహిద్‌ అఫ్రిది, షాబాద్‌ ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, కమ్రాన్‌ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, July 31, 2021, 15:20 [IST]
Other articles published on Jul 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X