Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెర్షెల్ గిబ్స్‌ ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ ఇండియన్ క్రికెట‌ర్ ఎవరో తెలుసా?!!

Herschelle Gibbs names Virat Kohli as his all-time favourite Indian cricketer


డర్బన్:
దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ మనందరికి సుపరిచితమే. వన్డేల్లో ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన మొట్టమొదటి క్రికెట‌ర్ గిబ్స్. అంతేకాదు లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి వన్డే చరిత్రలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో గిబ్స్‌ 175 పరుగులు చేసి ప్రొటీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌర గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వంటి వారితో గిబ్స్‌ ఆడారు.
కోహ్లీనే ఆల్‌టైమ్ ఫేవ‌రెట్:

కోహ్లీనే ఆల్‌టైమ్ ఫేవ‌రెట్:

తాజాగా సోష‌ల్ మీడియాలో హెర్షెల్ గిబ్స్ స‌ర‌దాగా ఓ చిట్ చాట్ షో నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో భార‌త క్రికెటర్ల‌లో ఆల్‌టైమ్, ప్రస్తుత ఫేవ‌రెట్ ఎవరు అని ఒక నెటిజ‌న్ అడగ్గా.. భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ అని వెంటనే స‌మాధానం ఇచ్చారు. గిబ్స్ సమాధానంతో క్రికెట్ ఫాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు అభిమానులు సచిన్ పేరు చెపుతారని ఊహించగా.. గిబ్స్ నుండి ఆ సమాధానం రాకపోవడంతో నిరాశ చెందారు.

 టెస్టుల్లో అత్య‌ధిక డ‌బుల్ సెంచ‌రీలు:

టెస్టుల్లో అత్య‌ధిక డ‌బుల్ సెంచ‌రీలు:

సౌతాఫ్రికా త‌ర‌పున ఆడిన మేటి క్రికెట‌ర్ల‌లో హెర్షెల్ గిబ్స్ ఒక‌డు. చురుకైన ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. అలాంటి దిగ్గజ ఆట‌గాడి నుంచి కోహ్లీకి ప్ర‌శంస‌లు ద‌క్క‌డంపై అతని ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌, నాయ‌కత్వ ల‌క్ష‌ణాల‌తో అంత‌ర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోహ్లీ ఇప్ప‌టికే త‌న పేరిట ఎన్నో రికార్డుల‌ను లిఖించుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్య‌ధిక డ‌బుల్ సెంచ‌రీలు, వ‌న్డేల్లో 43 సెంచ‌రీలు, టీ20ల్లో 2,794 ప‌రుగుల‌తో అత్య‌ధిక ర‌న్స్ చేసిన క్రికెటర్ కూడా కోహ్లీనే.

2010లో చివరి మ్యాచ్‌:

2010లో చివరి మ్యాచ్‌:

గిబ్స్‌ అంతర్జాతీయ కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టుల్లో 6167 పరుగులు, 248 వన్డేల్లో 8094 పరుగులు, 23 టీ20ల్లో 400 పరుగులు చేసారు. జట్టు తరపున ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ స్థానంలో ఆడి ఎన్నో విజయాలు అందించారు. గిబ్స్‌ 2010లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడారు. ఇక 2012లో తన చివరి ఐపీఎల్ గేమ్‌ను ఆడారు.

 జంతువుల్లాగా ప్రవర్తించారు:

జంతువుల్లాగా ప్రవర్తించారు:

గిబ్స్‌ తాజాగా 2007లో ఐసీసీ తనపై వేసిన రెండు టెస్టుల నిషేధాన్ని గుర్తుచేసుకున్నారు. 2007లో మీరు నిషేధం ఎదుర్కోవడానికి కారణమేంటని గిబ్స్‌ను ఓ నెటిజన్‌ ప్రశ్నించింగా.. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. 'పాకిస్తాన్‌ నుంచి వచ్చిన కొంతమంది రౌడీ మద్దతుదారులను జంతువులు అని అన్నాను. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన నా భార్య, కుమారుడిని వారు తమ సీట్లలో నుంచి బలవంతంగా బయటకు పంపించారు' అని ట్వీట్ చేశారు.

Story first published: Tuesday, February 4, 2020, 15:55 [IST]
Other articles published on Feb 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+