Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్‌తో ఎఫైర్.. ఘాటుగా స్పందించిన హీరోయిన్ సోనాల్‌ చౌహ‌న్!!

Heroine Sonal Chauhan fires on Netizen, relationship rumours with Cricketer KL Rahul

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో టీమిండియా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ క్రికెట్‌లో కంటే వ్యక్తిగత విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమంలో కేఎల్‌ రాహుల్‌ పాల్గొని మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ వేటుకు గురైయ్యాడు. ఇక పలువురు బాలీవుడ్ భామలతో లవ్‌లో ఉన్నాడని గతంలో వార్తలు వచ్చాయి. మోడల్ ఎలిక్సర్‌ నహర్‌.. కథానాయికలు సోనమ్‌ బజ్వా, ఆథియా శెట్టి, నిధి అగర్వాల్‌తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.

సోనాల్ చౌహాన్‌తో ఎఫైర్:

సోనాల్ చౌహాన్‌తో ఎఫైర్:

ఇటీవల అలియాభట్ బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ అనే అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ను ఆకాంక్ష గురించి అడగ్గా.. అది తన వ్యక్తిగత విషయమని, అనవసరంగా మీడియా సంస్థలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డాడు. ప్రస్తుతం రాహుల్ మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో ప్రేమలో పడ్డట్లు వార్తలు జోరందుకున్నాయి. రాహుల్‌తో ఎఫైర్‌కి సంబంధించి ప‌లు మీడియా సంస్థ‌ల ద్వారా ఈ అమ్మ‌డు క్లారిటీ ఇచ్చిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు.

రూమ‌ర్స్‌ ఎవ‌రు పుట్టిస్తున్నారు:

రూమ‌ర్స్‌ ఎవ‌రు పుట్టిస్తున్నారు:

తాజాగా ఓ నెటిజ‌న్ సోనాల్ చౌహాన్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసాడు. 'రూమ‌ర్స్ లేకుండా మీరు చిత్ర పరిశ్రమలో మనుగడ సాగించలేరు. ప్రజల దృష్టిని ఆక‌ర్షించ‌దానికి మీరు అనవసర రూమ‌ర్స్ సృష్టిస్తున్నారు' అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సోనాల్.. 'రూమ‌ర్స్ .. రూమ‌ర్స్‌.. ఎవ‌రు వీటిని పుట్టిస్తున్నారు అని మండిపడింది. 'మీరు ప్ర‌తి విష‌యంలో నిపుణుడి వలె క‌నిపిస్తున్నారు. మీరు విచారకరమైన జీవితంతో చాలా నిరాశ చెందారు. ప్రతి ఒక్కరి గురించి నెగెటివ్ కోణంలో ఆలోచించే మీ ప్రతికూల మనస్తత్వాన్ని మార్చడంపై మీరు దృష్టి పెట్టాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా' అని సోనాల్ మరో ట్వీట్‌లో రాసుకొచ్చింది.

అఫైర్ వార్తల్లో వాస్తవం లేదు:

అఫైర్ వార్తల్లో వాస్తవం లేదు:

ఇదివరకు రాహుల్‌తో డేటింగ్ చేస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు సొనాల్ చౌహాన్ స్పందిస్తూ.. 'అలాంటిదేమీ లేదు. ఆయన మంచి క్రికెటర్. ప్రతిభావంతుడు. చాలా మంచివాడు. మా మధ్య అఫైర్ వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ మీడియా కల్పితాలే అని అన్నారు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదంటూ డేటింగ్ వార్తలను ఆమె తోసిపుచ్చింది. లెజెండ్‌, డిక్టెట‌ర్ చిత్రాల‌లో సోనాల్ చౌహ‌న్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. మరోవైపు రాహుల్ వరుసగా విఫలమయి జట్టులో చోటు కోల్పోయాడు.

Story first published: Friday, September 20, 2019, 14:18 [IST]
Other articles published on Sep 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+