ధోనితో హాట్ బ్యూటీ సెల్ఫీ: ఇంటర్నెట్‌లో వైరల్
హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో నటి ఆండ్రియా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌లా మారింది. సాధారణంగా సినిమా తారలకు అభిమానులుంటారు. వారు ఎక్కడైనా కనిపిస్తే వారితో ఓ సెల్ఫీ దిగాలనే కోరిక సగటు అభిమానికి ఉంటుంది.
అదే విధంగా సెలబ్రిటీలుగా ఉన్న వారికి కూడా తమ అభిమానులు తారస పడితే వారితో ఓ సెల్ఫీ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. సరిగ్గా అలాగే ఇక్కడ జరిగింది. ధోనీని కలవాలని, అతడితో సెల్ఫీ దిగడానికి చాలా మంది ఎదురు చూస్తారు. ఇప్పుడు ధోనీతో ఒక నటి కూడా ఇలాగే సెల్ఫీ దిగి తన అభిమానాన్ని చాటిచెప్పింది.
నటి, ప్లే బ్యాక్ సింగర్ అయిన ఆండ్రియా ప్రయాణిస్తున్న విమానంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కనిపించాడు. ఇక అంతే వెంటనే ఆమె ధోనీతో కలిసి ఓ సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీ ఫోటోను ఆండ్రియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడ ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌లా మారింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో తరమణి చిత్రంతో పాటు, ధనుష్‌తో వడచెన్నై అనే చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో నటి లక్ష్మీరాయ్‌తో ధోనికి సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆండ్రియా సైతం యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు ఇంటర్నెట్‌లో పెను కలకలాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications