బెంగుళూరులో అనుకోని అతిథిని కలిసిన నటుడు అఖిల్
హైదరాబాద్: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ను టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్ కలిశాడు. బెంగుళూరులోని వైదేహీ మెడికల్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ను కలిసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లలో విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా అఖిల్ ఆకాంక్షించాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమమైంది.
మూడో టెస్టు మార్చి 16న రాంచీలో ప్రారంభం కానుంది. ఇక చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది. మరోవైపు అఖిల్ తనను కలిసిన విషయాన్ని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా అభిమానులతో పంచుకున్నారు. అఖిల్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications