Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయంలో కీలకపాత్ర: రెండో వన్డేలో చాహల్ స్పెల్ ఎందుకంత ప్రత్యేకం

Here's Why Yuzvendra Chahal's Five-Wicket Haul Against South Africa is Special

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. సఫారీ గడ్డపై 118 పరుగులకే ఆలౌటై, స్వదేశంలో మొట్టమొదటిసారి అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా చెత్త రికార్డుని నెలకొల్పింది.

మరోవైపు కోహ్లీసేన 177 బంతులు మిగిలి ఉండగా దక్షిణాఫ్రికాను ఓడించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అయితే రెండో వన్డేలో భారత విజయంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ఎనిమిది వికెట్లు తీసి 42 పరుగులిచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అయితే, కుల్దీప్‌తో పోలిస్తే యజువేంద్ర చాహుల్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో చాహల్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సఫారీ గడ్డపై వన్డేల్లో ఆ జట్టుపై ఐదు వికెట్లు సాధించిన తొలి స్పిన్నర్‌గా చాహల్‌ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల నాటి రికార్డును చాహల్‌ తిరగరాశాడు.

సఫారీ గడ్డపై భారత తరపున రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. 1999లో సఫారీలతో నైరోబిలో జరిగిన వన్డేలో మాజీ స్సిన్నర్‌ సునీల్‌ జోషి ఆరు పరుగులకే ఐదు వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి భారత్‌ తరపున దక్షిణాఫ్రికాపై చాహల్‌దే అత్యుత్తమ ప్రదర్శన.

రెండో వన్డేలో నమోదైన గణాంకాలు:

* సఫారీ గడ్డపై స్పిన్నర్‌గా చాహల్ రెండో అత్యుత్తమ(5/22) ప్రదర్శన నమోదు చేశాడు. 1999లో సునీల్‌ జోషి (5/6) ప్రదర్శన మొదటి స్థానంలో ఉంది. కేప్‌టౌన్ (2002)లో నికీ బోయే(5/21) ఇప్పటివరకు అత్యుత్తమం.
* సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు 118. 2009లో ఇంగ్లాండ్‌పై 119 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా వన్డేల్లో సఫారీలకు ఇది ఎనిమిదో స్వల్ప స్కోరు.
* డివిలీయర్స్, డుప్లెసిస్ లేకుండా దక్షిణాఫ్రికా వన్డేల్లో బరిలోకి దిగడం 2009 తర్వాత ఇదే తొలిసారి.
* ఆసియా బయట భారత స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో చాహల్, కుల్దీప్ ఎనిమిది వికెట్లు తీశారు.
* వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ సిరిస్‌ను గెలిస్తే నెంబర్‌వన్‌ ర్యాంక్‌ నిలుస్తుంది.

Story first published: Monday, February 5, 2018, 12:49 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+