For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ కలల రాణి ఎవరీ హజెల్‌ కీచ్?

ఢిల్లీ: గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ దీపావళి రోజున ఇండోనేషియాలో నిశ్చిత్తార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వీరిద్దరూ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి కూడా సానుకూల స్పందనలే వచ్చాయి.

Here's why Yuvraj Singh decides to get married to Bollywood actress Hazel Keech

అంతేగాక, యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. హజెల్ చాలా మంచి అమ్మాయి అని తెలిపాడు. యువీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుందని నమ్ముతున్నట్లు కూడా చెప్పాడు. ఆమెతో పెళ్లి తర్వాత టీమిండియాలో యువీ చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

'ఇక హజెల్‌కు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదు. ఇంట్లో యువీకి తలపోటు తప్పుతుంది. వాళ్లిదరి నిర్ణయంతో సంతోషంగా ఉన్నా' అంటూ యువీ తల్లి షబ్నమ్ కూడా చెప్పింది. ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కటవుతుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

Here's why Yuvraj Singh decides to get married to Bollywood actress Hazel Keech

ఇక హజెల్ కీచ్ గురించి..

సుజికీ యాడ్ చూసిన వాళ్లందరికీ హజెల్ సుపరిచితమే. 28 ఏళ్ల హజెల్ కీచ్ ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగింది. అయితే ఆమె తల్లి మహారాష్ట్రకు చెందిన వారు. చిన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్ అంటే ఆమెకు ప్రాణం. సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడమన్నా ఇష్టమే.

ముందుగా డ్యాన్స్ మీద దృష్టి సారించిన కీచ్.. ఇండియన్ క్లాసికల్, వెస్ట్రన్ కాంటెంపరరీ డాన్స్ ఫామ్‌లను నేర్చుకుంది. ఈ రెండూ విభిన్నమైనవి. అయినా ఇష్టపడి.. కష్టమైనా నేర్చుకుంది. ఆ తర్వాత పాటలు, యాక్టింగ్ కోర్సు కూడా చేసేసింది.

Here's why Yuvraj Singh decides to get married to Bollywood actress Hazel Keech

హై స్కూల్ అయిపోయేసరికి తన కోచింగ్‌లు కూడా అయిపోయాయి. స్కూల్ లెవల్లో ఉన్నప్పుడే ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది హజెల్. ముందుగా ఓ బ్రిటీష్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. అప్పుడే బిబిసి డాక్యుమెంటరీ షో 'కాల్ ద షాట్స్'లో అవకాశమొచ్చింది. 2002 లండన్‌లో బాంబే డ్రీమ్స్ మ్యూజికల్ ప్రమోషనల్ టూర్ జరిగింది. ఆ అవకాశాన్నీ చేజార్చుకోలేదు హజెల్. ఆ తర్వాత 18 ఏళ్లకు తన మకాం పూర్తిగా ముంబైకి మార్చేసింది.

ఇండియా తిరిగొచ్చాక మోడల్‌గా చాలా అవకాశాలొచ్చాయి. వాటిని ఒడిసి పట్టుకుంది హజెల్. చాలా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కనిపించింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఇవి చూసినా తమిళ తంబీలు మొదటగా ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దీంతో మొదటిసారి ఐటమ్‌సాంగ్‌లో కనిపించింది హజెల్. అయితే అది ఆమె కెరీర్‌కి ప్లస్ అవ్వలేదు.

మళ్లీ మోడల్‌గానే ఆమె ప్రయత్నించింది. సల్మాన్ రూపంలో మరోసారి ఆమె అదృష్టం తలుపుతట్టింది. బాడీగార్డ్‌లో రెండవ హీరోయిన్‌గా ఛాన్స్. దాంట్లో నటనపరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డా, అది కెరీర్‌కు ఎలాంటి ప్లస్ అవ్వలేదు. మధ్యలో బిగ్‌బాస్-7లోనూ మెరిసింది.

మ్యాగ్జిమమ్(హిందీ), తెలుగులో.. కృష్ణం వందే జగద్గురుమ్‌లో తళుక్కున మెరిసింది హజెల్. హరీపోటర్ మూవీస్‌లో కూడా ఈ సుందరి కనిపించిందట. ఇవికాక జల్‌క దిఖ్‌లాజా, కామెడీ సర్కస్ అనే షోలోనూ పాల్గొంది. హజెల్‌కి బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులారిటీ వచ్చింది. అప్పుడే యువీతో పరిచయం ఏర్పడింది. అదే ఇప్పుడు వారి పెళ్లికి దారితీసింది.

Here's why Yuvraj Singh decides to get married to Bollywood actress Hazel Keech

యువీని గెలిచిన హెజల్ గురించి యూవీ గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆమెను తన తల్లితో పోల్చుతూ ఆనందం వ్యక్తం చేశాడు. 'మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఒక మంచి ఫ్రెండ్ నా లైఫ్ పార్టనర్‌గా దొరికింది. అమ్మ కూడా అచ్చు నాలాగే ఉందిరా అంది. అంతకంటే నాకింకేం కావాలి. ఇప్పటికి ఇదే చెప్పగలను. ఇంకా ఏ విషయాన్ని నేను చెప్పదలుచుకోలేదు' అని యువీ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం తన దృష్టంతా క్రికెట్ ఆటపైనే ఉందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+