హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ ఆసాంతం ధరించిన జెర్సీ నెంబర్ 10ని తాజాగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ధరించడంపై చెలరేగిన వివాదం సమసి పోయేలా లేదు. పల్లెకెలె వేదికగా జరిగిన నాలుగో వన్డేతో వన్డేల్లో అరంగేట్రం చేసిన శార్దుల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీతో ఆడటం అందరినీ ఆశ్చర్యపరచింది.
సచిన్ తర్వాత ఎంతో మంది క్రికెటర్లు భారత్ తరుపున భారత జట్టులోకి వచ్చినప్పటికీ జెర్సీ నెంబర్ 10ని మాత్రం ధరించలేదు. అయితే నాలుగో వన్డేలో జెర్సీ నెంబర్ 10ని ధరించడంతో అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శార్దూల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సచిన్ టెండూల్కర్‌తో పాటు జెర్సీ నెంబరు 10 కూడా రిటైర్ అయ్యిందని.. దానిని అతని గౌరవార్థం ఎవరికీ కేటాయించొద్దని సోషల్ మీడియా ద్వారా బీసీసీఐకి అభిమానులు సూచించారు. శార్దూల్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని ఆ జెర్సీ ధరించొద్దంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు.
సచిన్‌కు తప్ప ఆ జెర్సీని ధరించే అర్హత మరెవరికీ లేదని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ జెర్సీ కథ ఇక ముగిసిందని, అది దేవుడిదని, వేరెవరికీ దానిని ధరించే అర్హత లేదంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే.. తాజాగా కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న ఐదో వన్డేలో కూడా అదే నెంబరు జెర్సీతో ఠాకూర్ మళ్లీ మైదానంలోకి రావడం విశేషం.
జెర్సీ నెంబర్ 10 వెనుక దాగున్న రహస్యం ఇదే
తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఠాకూర్ నెంబర్ 10 జెర్సీ ధరించడం వెనక ఉన్న విషయాన్ని వెల్లడించాడు. న్యూమరాలజీ ప్రకారమే దీనిని ధరించానని వివరించాడు. తాను అక్టోబరు 16, 1991లో జన్మించానని పేర్కొన్నాడు. దీని ప్రకారం [(1 6) (1 0) (1 9 9 1) = 7 1 (2 0) = 10] 10.. అని వివరించాడు. అందుకనే తాను నెంబర్ 10 జెర్సీని ధరిస్తున్నట్టు చెప్పాడు.