'కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు, నెహ్రా ఎంపిక శుభపరిణామం'
హైదరాబాద్: 'భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు' ఈ మాట అన్నది ఎవరో తెలుసా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్‌ని 4-1తో చేజిక్కించుకున్న భారత్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. 'భారత్ తరఫున గొప్ప కెప్టెన్ అయ్యే నైపుణ్యం విరాట్ కోహ్లీలో మెండుగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాబోవు 15 నెలలు అతనికి కెప్టెన్‌గా చాలా కీలకం. ఎందుకంటే.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లో భారత్ పర్యటించనుంది' అని దాదా అన్నాడు.
'అలాగే 2019లో వన్డే వరల్డ్ కప్ కూడా రాబోతోంది. నాకు తెలిసి.. విరాట్ కోహ్లీ సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకి అవకాశమిస్తూ జట్టుని తయారు చేసుకుంటున్నాడు. ఆసీస్ తర్వాత భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్, శ్రీలంక జట్లని భారత్ ఓడిస్తుంది. అయితే కోహ్లీసేనకు సవాల్ ఎదురయ్యేది మాత్రం దక్షిణాఫ్రికాలోనే. అక్కడ కూడా కోహ్లీ సేన మెరుగైన ప్రదర్శన చేస్తుందని నమ్ముతున్నా' అని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు.

పాండ్యాను కపిల్‌తో పోల్చడంపై
ఇక టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఇప్పుడే క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌తో పోల్చవద్దని కూడా గంగూలీ సూచించాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పాండ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

15 ఏళ్లు రాణించిన గొప్ప ఛాంపియన్ కపిల్‌దేవ్
ఈ నేపథ్యంలో కొందరు పాండ్యాను కపిల్‌తో పొలుస్తున్నారు. 'పాండ్యా ప్రదర్శరనతో కోహ్లీ సేన విజయం సాధించవచ్చు. కానీ 15 ఏళ్లు రాణించిన గొప్ప ఛాంపియన్ కపిల్‌దేవ్‌తో ఇప్పుడే పోల్చడం సరికాదు. పాండ్యా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు. పాండ్యా ఓ మంచి క్రికెటర్, తన ఆటను ఆస్వాదించనివ్వండి. ఇలానే భవిష్యత్తులో రాణించాలని ఆశిస్తున్నా' అని గంగూలీ అన్నాడు.

టీ20 సిరీస్‌కి ఆశిష్ నెహ్రాని ఎంపిక చేయడంపై
ఆసీస్‌తో శనివారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాని సెలక్టర్లు ఎంపిక చేయడంపై గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. వయసు ఆధారంగా కాకుండా.. ప్రతిభని దృష్టిలో పెట్టుకుని ఎంపిక జరగడం ప్రశంసనీయమని చెప్పాడు. ముఖ్యంగా శిష్ నెహ్రా ఎంపిక చేయడం పట్ల దాదా సెలక్టర్లను ప్రశంసించారు.

నెహ్రా ఎంపిక భారత క్రికెట్‌కి శుభపరిణామం
వయస్సుతో సంబంధం లేకుండా నెహ్రాను ఎంపిక చేయడం భారత క్రికెట్‌కు మంచి పరిణామమని అన్నాడు. నెహ్రా అనుభవం ఉన్న టీ20 బౌలర్ అని చెప్పుకొచ్చిన గంగూలీ అతని సత్తా ఏమిటో గత టీ20 వరల్డ్‌కప్‌లో చూశామని చెప్పాడు. 'నెహ్రా ఎంపిక భారత క్రికెట్‌కి శుభపరిణామం. సెలక్టర్లు వయసుతో సంబంధం లేకుండా ప్రతిభ ఆధారంగా జట్టుని ఎంపిక చేశారు. అతను టీ20ల్లో అద్భుతమైన బౌలర్. గత టీ20 ప్రపంచకప్‌లో అతని బౌలింగ్‌ని మనమంతా చూశాం. ఒక ఎడమచేతి వాటం పేస్ బౌలర్‌గా.. జట్టులో అతను ఈ టీ20 సిరీస్‌లో కీలకంగా మారనున్నాడు. జట్టులో నెహ్రా తప్పకుండా తనదైన ముద్ర వేస్తాడు' అని గంగూలీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications