భారత్ Vs ఇంగ్లాండ్ సిరిస్: ప్రపంచ రికార్డు నమోదు
హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన వన్డే సిరిస్‌లో పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన మూడు వన్డేల్లో అంటే ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడొందలకు పైగా పరుగులు నమోదు కావడం ఒక ఎత్తు అయితే ఈ సిరిస్‌లో అత్యధిక పరుగుల రికార్డు నమోదైంది.
ఈ సిరీస్‌లో మొత్తం మీద ఇరు జట్లు నమోదు చేసిన స్కోరు 2090. ఇది మూడు వన్డేల సిరీస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డుగా లిఖించబడింది. అంతకుముందు 2007లో భారత్‌లో జరిగిన ఆఫ్రికా-ఆసియా కప్‌లో 1892 పరుగుల రికార్డుని ఈ వన్డే సిరిస్ అధిగమించింది. 2009-10 సీజన్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో 1884 పరుగులు నమోదయ్యాయి.
భారత్-ఇంగ్లాండ్ సిరిస్‌లో నమోదైన రికార్డులు:

ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడొందలకు పైగా స్కోర్లు
ఈ సిరిస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడొందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఐదు మ్యాచ్‌లు ఆడిన ఒక ద్వైపాక్షిక సిరీస్ పరంగా చూస్తే ఇలా ఆరు సార్లు మూడొందలకు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి.

మూడో అత్యుత్తమంగా జాదవ్ స్ట్రయిక్ రేట్
ఈ సిరిస్‌లో టీమిండియా ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ స్ట్రయిక్ రేట్ 144.09గా ఉంది. ఒక సిరీస్‌లో 150కు పైగా బంతులు ఆడిన భారత్ ఆటగాడి పరంగా ఇది మూడో అత్యుత్తమం. గతంలో వీరేంద్ర సెహ్వాగ్(150.25), రోహిత్ శర్మ(147.56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

మ్యాన్ ఆఫ్ ద సిరిస్ కేదార్ జాదవ్
ఈ సిరిస్‌లో కేదార్ జాదవ్ 232 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 77.33 యావరేజితో 232 పరుగులు చేసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మూడు సార్లు మూడొందలకు పైగా పరుగులు
మూడు వన్డేల సిరిస్‌లో ఇంగ్లాండ్ మూడు సార్లు మూడొందలకు పైగా పరుగులు చేసింది. 2015లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ నాలుగుసార్లు మూడొందలకు పైగా పరుగులను సాధించింది.

స్టోక్స్ అర్ధ సెంచరీతో పాటు మూడు వికెట్లు
ఒక వన్డేలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీయడం ఇప్పటివరకూ 15సార్లు జరిగింది. కోల్ కతా వన్డేలో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీతో పాటు మూడు వికెట్లు సాధించాడు. 2009 నుంచి ఇప్పటివరకూ ఇంగ్లాండ్ మూడుసార్లు ఈ ఘనతను సాధించగా, స్టోక్స్ రెండు సార్లు ఆ ఘనతను సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications