న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ, ప్రతిమా సింగ్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం నాడు జరిగింది. మైదానంలో ఇషాంత్ శర్మ దూకుడుగా ఉండే విషయం తెలిసిందే. గత ఏడాది శ్రీలంక పర్యటనలో దమ్మిక ప్రసాద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇది ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
క్రికెట్‌కు సంబంధించి మినహా, వ్యక్తిగత జీవితం విషయమై ఇషాంత్ శర్మ ఎప్పుడు కూడా వార్తల్లోకి రాలేదు. ఇప్పుడు, బాస్కెట్ బాల్ స్టార్ ప్రతిమా సింగ్‌తో ఎంగేజ్‌మెంట్ జరగడం ద్వారా న్యూస్‌లోకి వచ్చాడు. తద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అతని కాబోయే భార్య ప్రతిమ ప్రకారం... 'ఇషాంత్ శర్మ చాలా డీసెంట్ వ్యక్తి. కేరింగ్ పర్సన్. మేమిద్దరం కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం. ఇన్ని రోజుల్లో నాకు తెలిసిందేమంటే.. ప్రపంచంలోనే నా దృష్టిలో ఇతను చాలా బెస్ట్ వ్యక్తి' అని ప్రతిప చెప్పారు.
క్రీడాకారిణి ప్రతిమతో ఇషాంత్ నిశ్చితార్థం(ఫొటోలు)
అంతేకాదు, తన వరకు ఇషాంత్ ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ వ్యక్తి అని ప్రతిమ చెప్పారు. తనకు ఓ కారులో బహుమతులు, గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేశాడని ప్రతిమ అన్నారు.
ప్రతిమ సోదరి ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూత... ఇషాంత్ తన సోదరికి మూడేళ్ల క్రితం పరిచయమయ్యాడని చెప్పారు. ఢిల్లీలో మహిళల కోసం ఓ బాక్సెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించటామని, అప్పుడు ఇషాంత్ తన స్నేహితులతో వచ్చాడని, ఆ సమయంలో పరిచయం ఏర్పడిందన్నారు.