Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనికి పద్మభూషణ్ ఇవ్వడం లేదు: కారణాలివే!

హైదరాబాద్: భారత అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అలాంటి ధోని పేరుని రెండు రోజుల క్రితం బీసీసీఐ దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు లేవని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ధోని పేరును కేంద్ర ప్రభుత్వం మరోసారి తిరస్కరించినట్లు తెలుస్తోంది. నిజానికి పద్మభూషణ్ పురస్కారానికి ధోని పేరుని బీసీసీఐ సిఫారసు చేయడం ఇది మూడోసారి. గతంలో ఈ పురస్కారానికి 2013, 16ల్లోనూ ధోని పేరును బీసీసీఐ సిఫారసు చేసిన సున్నితంగా తిరస్కరించింది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ధోని పేరు పదే పదే సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రావడం వల్ల ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక పరుస్కారానికి ధోని పేరును తిరస్కరించినట్లు సమాచారం.

ఫిక్సింగ్‌తో సంబంధాలున్నట్టు రుజువు కాలేదు

ఫిక్సింగ్‌తో సంబంధాలున్నట్టు రుజువు కాలేదు

నిజానికి ఈ కేసులో ధోని పేరు వినిపించినప్పటికీ ఎలాంటి ఆధారాలు కానీ, ఫిక్సింగ్‌తో సంబంధాలున్నట్టు కానీ రుజువు కాలేదు. అయితే ధోని ఇప్పటికే అర్జున అవార్డుతో పాటు రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు కూడా అందుకున్నాడు. అయితే ధోనికి పద్మభూషణ్ అవార్డు లభిస్తే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు.

11వ క్రికెటర్‌గా గుర్తింపు

11వ క్రికెటర్‌గా గుర్తింపు

అంతకు ముందు సచిన్‌ టెండూల్కర్, కపిల్‌ దేవ్, సునీల్‌ గవాస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, చందు బోర్డే, డీబీ డియోధర్‌, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్‌, రాజా బలీందర్‌ సింగ్‌, విజయ ఆనంద్‌లు పద్మభూషణ్‌ అవార్డులకు మాత్రమే పద్మభూషణ్ అవార్డు లభించింది.

కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు అందించాడు

కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు అందించాడు

భారత్‌కు కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు (2011 వన్డే ప్రపంచ కప్, 2007 టి20 వరల్డ్ కప్) అందించిన ధోని ఇప్పటి వరకు 90 టెస్టుల్లో 4,876 పరుగులు సాధించగా.. 302 వన్డేల్లో 9,737 పరుగులు, 78 టీ20ల్లో 1,212 పరుగులు నమోదు చేశాడు. ధోని నాయకత్వంలో టీమిండియా ఐసీసీ మూడు టోర్నీలను గెలుచుకుంది.

ఇటీవలే 100 స్టంపౌట్ల రికార్డు

ఇటీవలే 100 స్టంపౌట్ల రికార్డు

ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 100 స్టంపౌట్ల రికార్డును నెలకొల్పాడు. ఇటీవల మూడొందల వన్డేను పూర్తి చేసుకున్న ధోని.. ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్ల జాబితాలో కూడా చేరాడు. మరోవైపు వన్డేల్లో పదివేల పరుగులకు చేరువయ్యాడు. భారత క్రికెట్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ధోని నిజానికి, పద్మభూషణ్ అందుకోవడానికి అన్నివిధాలుగా అర్హుడిగానే చెప్పాలి.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+