
హైదరాబాద్: సూపర్‌ఫామ్‌లో ఉన్న కోహ్లీసేన ఆదివారం అత్యంత ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఒక్క ఇన్నింగ్స్ సమయానికే మొత్తం మ్యాచ్‌ను ముగించింది. భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్ (5/22), కుల్‌దీప్ (3/20) తిప్పుడుకు తిప్పలు పడ్డ ఆతిథ్య జట్టు మొదట 32.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 20.3 ఓవర్లలో ఒకే వికెట్ చేజార్చుకుని అలవోకగా ఛేదించింది. శిఖర్ ధావన్ (51 నాటౌట్; 56 బంతుల్లో 9×4), విరాట్ కోహ్లి (46 నాటౌట్; 50 బంతుల్లో 4×4, 1×6) బ్యాట్ ఝుళిపించారు.
భారత అండర్ 19 జట్టు కుర్రాళ్లు విజృంభించారు. ద్రవిడ్ నేతృత్వంలో వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 3 శనివారం న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడి విజయం సాధించారు. దీంతో జట్టు కంటే ద్రవిడ్‌కే పొగడ్తల వెల్లువ ఎక్కువైంది.
సోషల్ మీడియాలో రాహుల్ ద్రవిడ్ అనే హాష్ ట్యాగ్ ఏకంగా ఓ మైక్రో వైబ్ సైట్ తయారయేంత స్థాయిలో వైరల్ అయింది. ట్విట్టర్‌లో సైతం అభినందనలు క్యూ కడుతున్నాయి. ఈ ప్రశంసలన్నింటిని ద్రవిడ్ ఇబ్బందికరంగా భావిస్తున్నాడట. అతను సహజంగానే ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు.
కాబట్టే, అతని కెరీర్‌లో 10,000కు మించి పరుగులు చేసిన రికార్డు ఉన్నా హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. వరల్డ్ కప్ గెలుచుకోవడంలో ప్రధాన కోచ్‌గా కీలక పాత్ర పోషించినప్పటికీ ఈ ఘనతని తానొక్కడికే ఆపాదించడాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నాడు.
"ఇది చాలా గర్వకారణం. చెప్పింది చెప్పినట్టు చేసే క్రికెటర్లు దొరకడం చాలా గొప్ప విషయం. కుర్రాళ్లు ఆటను అదరగొట్టారు. దాంతో పాటు క్రీడా సిబ్బంది కూడా కృతజ్ఞతలు. కుర్రాళ్లకు ఇది చరిత్రలో నిలిచిపోయే విషయం. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా ఎన్నో రావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.