ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రెండేళ్ల కోసం వచ్చిన పుణె, రాజ్‌కోట్ జట్లకు క్రీడాకారులు డ్రాఫ్టింగ్ డిసెంబర్ 15న ముంబైలోని బికెసి క్లబ్ హౌస్‌లో జరగనుంది. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఏ జట్టు తీసుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది.
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దోషులను పేర్కొంటూ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై జస్టిస్ లోధా కమిటీ రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ ప్రాంచైజీల స్థానంలో ఆడేందుకు గాను ఈనెల ఎనిమిదో తేదీన 'రివర్స్ బిడ్డింగ్' విధానంలో పుణే, రాజ్‌కోట్ జట్లను బీసీసీఐ ఖరారు చేసింది.
పుణె జట్టును సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ జట్టును ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ దక్కించుకుంది. రేపు జరగనున్న వేలంపాటలో మొత్తం 50 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో 33 భారతీయ ఆటగాళ్లు ఉండగా, 17 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

డ్రాఫ్టింగ్‌లో ఆటగాళ్లు వరుసగా:
1. Ravichandran Ashwin
2. Stuart Binny
3. MS Dhoni
4. Ravindra Jadeja
5. Dhawal Kulkarni
6. Abhishek Nayar
7. Ashish Nehra
8. Irfan Pathan
9. Ajinkya Rahane
10. Suresh Raina
11. Sanju Samson
12. Mohit Sharma
13. Rahul Sharma
14. Baba Aparajith
15. Ankush Bains
16. Rajat Bhatia
17. Eklavya Dwivedi
18. Deepak Hooda
19. Vikramjeet Malik
20. Mithun Manhas
21. Ronit More
22. Karun Nair
23. Pawan Negi
24. Ishwar Chandra Pandey
25. Pardeep Sahu
26. Dinesh Salunkhe
27. Barinder Singh Saran
28. Ankit Nagendra Sharma
29. Pratyush Singh
30. Pravin Tambe
31. Rahul Tewatia
32. Sagar Vijay Trivedi
33. Dishant Yagnik
34. Kyle Abbott (South Africa)
35. Samuel Badree (West Indies)
36. Dwayne Bravo (West Indies)
37. Ben Cutting (Australia)
38. Faf du Plessis (South Africa)
39. James Faulkner (Australia)
40. Matt Henry (New Zealand)
41. Michael Hussey (Australia)
42. Brendon McCullum (New Zealand)
43. Christopher Morris (South Africa)
44. Kane Richardson (New Zealand)
45. Dwayne Smith (West Indies)
46. Steve Smith (Australia)
47. Tim Southee (New Zealand)
48. Juan Theron (South Africa)
49. Andrew Tye (Australia)
50. Shane Watson (Australia)
తెలుగు వన్ఇండియా