Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడేది ఆ జట్లేనట - ఒకే ఒరలో ఆ రెండు కత్తులు

 Here is the details of Chris Gayles prediction on the finalists of T20 World Cup 2022.

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెండు విడిపోయింది. టీమ్ ఏ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోండగా.. టీమ్ బీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టు టీ20 ప్రపంచకప్ 2022 కోసం సన్నద్ధమౌతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. టీమ్ బీకి డాషింగ్ బ్యాటర్ శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. ఈ జట్టు ఇవ్వాళ దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో తలపడబోతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

ఆస్ట్రేలియాలో..

ఆస్ట్రేలియాలో..

క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా టీ20 ప్రపంచకప్ కోసం సమాయాత్తమౌతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ ప్రిస్టేజియస్ మెగా టోర్నమెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా దీన్ని నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్.. ఇలా టీమ్ ఏ ప్లేయర్లందరూ ఆస్ట్రేలియాలో నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు.

 22 నుంచి సూపర్ 12

22 నుంచి సూపర్ 12

ఈ నెల 16వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయి. 21వ తేదీన స్కాట్లాండ్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్స్ దశ ముగుస్తుంది. ఆ తరువాతే అసలు పోరు ఉంటుంది. 22 తేదీ నుంచి సూపర్ 12 మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది.

అంచనాలు షురూ..

అంచనాలు షురూ..

ఇదిలావుండగా- టీ20 ప్రపంచకప్ 2022పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఏ జట్టు ముందడుగు వేస్తుంది? ఏ టీమ్ ఫైనల్స్‌కు చేరుకుంటుందనే అంచనాలు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ ఈవెంట్ ఫైనలిస్టులెవరనేది తేల్చేశాడు. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా సహా నాలుగు జట్లను ఎంపిక చేశాడీ వెస్టిండీస్ వీరుడు. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేశాడు.

 ఆస్ట్రేలియాతో ఢీ కొనే జట్లు..

ఆస్ట్రేలియాతో ఢీ కొనే జట్లు..

ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఫైనల్స్ చేరుకుంటుందని జోస్యం చెప్పాడు క్రిస్ గేల్. ఫైనల్స్‌లో రెండో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మూడింట్లో ఏదో ఒక టీమ్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుందని అన్నాడు. తన సొంత జట్టు వెస్టిండీస్‌కు ఆ అవకాశం లేదని వ్యాఖ్యానించాడు. ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో లేకుండా వెస్టిండీస్‌కు విజయం సాధించడం అంత సులభం కాదని తేల్చి చెప్పాడు.

ప్రమాదకరంగా విండీస్..

ప్రమాదకరంగా విండీస్..

టీ20 ప్రపంచకప్ 2022 వేదికగా- వెస్టిండీస్ ఇప్పటికీ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిరూపించుకోగలదనే ఆత్మవిశ్వాసాన్ని క్రిస్ గేల్ వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరగాలని తాను ఆశిస్తోన్నానని, అది సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించాడు. కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, బ్రావోలు జట్టులో లేకపోవడం వల్ల ఫైనల్స్ చేరడం కష్టతరమౌతుందని అన్నాడు. ఇప్పుడున్న టీమ్ ప్రమాదకరంగా మారడానికీ అవకాశం లేకపోలేదని చెప్పాడు.

Story first published: Tuesday, October 11, 2022, 10:53 [IST]
Other articles published on Oct 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+