Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా కోహ్లీ: మైకేల్ తెలుగు 'టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్' ఇదే

హైదరాబాద్: ఈ ఏడాది అభిమానులకు టెస్టు క్రికెట్ ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. టెస్టు క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనలు నమోదయ్యాయి. ఉదహరణకు చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ నాయర్ ట్రిపుల్ సెంచరీ... వాకా స్టేడియంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ... ఇండియాపై స్టీవ్ ఓకీఫీ 12 వికెట్లు తీయడం... టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు డబుల్ సెంచరీలు... మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలైన యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ఇలా ఎన్నో...

ఈ ఏడాది అటు బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. వారి ప్రదర్శన, గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న మైకేల్ తెలుగు ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు జట్టుని ప్రకటిస్తోంది. డిసెంబర్ 20, 2019నాటికి ఆటగాళ్ల గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఈ టెస్టు జట్టుని ప్రకటించడం జరిగింది. ఈ టెస్టు జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్లు, ఒక ఆల్ రౌండర్, ఒక వికెట్ కీపర్, నలుగురు రెగ్యులర్ బౌలర్లను ఎంపిక చేయడం జరిగింది. 2017లో వీరి ప్రదర్శన ఆధారంగా జట్టులోకి ఎంపిక చేయడం జరిగింది.

డీన్ ఎల్గర్

డీన్ ఎల్గర్

దక్షిణాఫ్రికాకు చెందిన డీన్ ఎల్గర్‌కు 2017 ఎన్నో తీపిగుర్తులను మిగిల్చింది. ఈ ఏడాది డీన్ ఎల్గర్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 1097 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఎల్గర్ మూడు సెంచరీలు చేయడం విశేషం. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా తరుపున ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

ఈ ఏడాది మొదట్లో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాల పాలయ్యాడు. కోలుకున్న అనంతరం టెస్టుల్లో రెండు సెంచరీలతో మెరిశాడు. అయితే ఈ రెండు సెంచరీలు శ్రీలంకపైనే చేయడం విశేషం.

ఛటేశ్వర్ పుజారా

ఛటేశ్వర్ పుజారా

టెస్టు స్పెషలిస్ట్‌గా పేరొందిన పుజారా ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పుజారా అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో పుజారా 1140 పరుగులు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఒక సెంచరీ, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో రెండు సెంచరీలు చేశాడు. తాను ఆడిన ప్రతి సిరిస్‌లో కూడా పుజారా సెంచరీ చేయడం విశేషం.

విరాట్ కోహ్లీ (కెప్టెన్)

విరాట్ కోహ్లీ (కెప్టెన్)

2017 విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. కోహ్లీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2017 కోహ్లీకి ఎన్నో తీపి గుర్తులను మిగిల్చింది. ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రీలంకపై రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే ఆస్ట్రేలియా సిరిస్‌లో మాత్రం విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు.

స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్)

స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్)

టెస్టు క్రికెట్‌లో తనకు సాటిలేదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి నిరూపించుకున్నాడు. భారత్‌ పర్యటనలో పూణె వేదికగా జరిగిన టెస్టులో సెంచరీతో అలరించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో ఒకటి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ ఏడాది స్మిత్ ఇప్పటివరకు 1127 పరుగులు చేశాడు.

షకీబ్ అల్ హాసన్

షకీబ్ అల్ హాసన్

బంగ్లాదేశ్ తరుపున నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ఒకడు. ఈ ఏడాది అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ మెరిశాడు. వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇక బౌలింగ్‌లో ఈ ఏడాది 29 వికెట్లు తీశాడు.

క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్)

క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్)

దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డీ కాక్ ఈ ఏడాది టెస్టుల్లో ఒకే సెంచరీ సాధించాడు. అయితే నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.

నాథన్ లియాన్

నాథన్ లియాన్

ఈ ఏడాది స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ చేసినంతగా మిగతా స్పిన్నర్లు చేయక పోవడం విశేషం. యాషెస్ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లియాన్ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.

కగిసో రబడ

కగిసో రబడ

దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడ ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసుకున్న ఫాస్ట్ బౌలర్ల జాబితాలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన పేసర్లలో ఒకడిగా నిలిచాడు.

జేమ్స్ ఆండర్సన్

జేమ్స్ ఆండర్సన్

టెస్టు మ్యాచ్‌ల విషయానికి వస్తే తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మన్ల గుండెల్లో ఆండర్సన్ నిద్రపోయాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో స్వింగ్ బంతులతో బ్యాట్స్‌మన్లకు ముచ్చెమటలు పట్టించాడు. టెస్టుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 51 వికెట్లు తీసుకున్నాడు.

యాసిర్ షా

యాసిర్ షా

పాకిస్థాన్‌కు చెందిన యాసిర్ షా ఇప్పటివరకు ఆరు టెస్టు మ్యాచ్‌లాడాడు. యాసిర్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న లెగ్ స్పిన్నర్లలో బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా ఇతడే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు యాసిర్ షా 43 వికెట్లు తీశాడు.

ముఖ్యమైన మినహాయింపులు:

ముఖ్యమైన మినహాయింపులు:

డేవిడ్ వార్నర్, దిముత్ కరుణరత్నే (ఓపెనర్లు)

కేన్ విలియమ్సన్, హషీం ఆమ్లా, దినేశ్ చండీమాల్ (మిడిల్ ఆర్డర్)

ముస్ఫికర్ రహీం (వికెట్ కీపర్)

రవిచంద్రన్ అశ్విన్, రంగనా హెరాత్ (బౌలర్లు)

Story first published: Wednesday, December 20, 2017, 18:04 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+