
హైదరాబాద్: భారత్ ఆటగాళ్లు ఇది చాలా జాగ్రత్తగా ఆడాల్సిన సమయమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 286కే దక్షిణాఫ్రికా ఆటగాళ్లందరూ ఔటయ్యారు. పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మొదటి టెస్ట్ రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన సంయమనం పాటించాలని హితవు పలికాడు.
మీడియా ప్రతినిధితో మాట్లాడిన మాజీ కెప్టెన్ గవాస్కర్ కొన్ని సూచనలిచ్చారు. మన ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌ను వన్డే మ్యాచ్ రీతిలో భావిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులు రాబడదామని ప్రయత్నిస్తున్నారు. అలా తొందరపడితే చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
పూజారా, రోహిత్‌లు సింగిల్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి అన్నారు. మ్యాచ్ అనుకూలతని బట్టి ఆడాలి కానీ, బ్యాటింగ్‌కు అనుకూలత లేని మైదానంలో వేగం పనికిరాదని సూచించారు. టెస్ట్ మ్యాచ్‌లో పదివేల వరకు పరుగులు తీసిన గవాస్కర్ పూజారా, రోహిత్ లు బాగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులంతా బాగా ఆడాలని అభినందనలు తెలియజేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.