పిల్లలను ఎప్పుడు కంటారని అడగ్గా.. అనుష్క ఏం చెప్పిందో తెలుసా?

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆనందంగా గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత మార్చి నుంచి కోహ్లీతోనే ఉన్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచి విరుష్క జోడి ఇంతకాలం ఒకచోట ఉండడం ఇదే మొదటిసారి. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు, సరదాగా గడిపే ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇప్పటికే పోస్టు చేశారు. అయితే మంగళవారం అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్న-జవాబు సెషన్‌లో పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు.

ఓటమి అంటే ద్వేషం:

ఓటమి అంటే ద్వేషం:

విరాట్ కోహ్లీకి ఏదంటే ద్వేషం అని ఓ అభిమాని అడగ్గా.. ఓటమి అంటే భారత్ క్రికెట్ కెప్టెన్‌కు ద్వేషం అని చెప్పారు. కోహ్లీని బోర్డు ఆటల్లో ఓడించి బాధించడం చాలా ఇష్టమని చెప్తున్నారీ ముద్దుగుమ్మ. 'నేను కోహ్లీని ఏదైనా బోర్డు గేమ్‌లో ఓడించి, దాన్ని రుద్దుకుంటే అతడికెంతో చికాకు. అతను విజయం కోల్పోవడాన్ని ద్వేషిస్తాడు' అని అనుష్కశర్మ చెప్పారు. విజయవంతమైన సంబంధాలను సృష్టించడానికి సహాయపడే అంశాల గురించి కూడా అనుష్క మాట్లాడారు. 'విశ్వాసం, ప్రేమ అనేది అంగీకారం అని తెలుసుకోవడం, మంచి సంబంధం యొక్క నిబద్ధత. వ్యక్తుల మధ్య అవగాహన వారి అత్యున్నత మానవ సామర్థ్యంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది' అని ఆమె చెప్పారు .

ఎవరూ నన్ను ఆగడట్లేదు:

ఎవరూ నన్ను ఆగడట్లేదు:

'మీ చుట్టూ ఉన్నవారు పిల్లలు ఎప్పుడు కంటారు అని ప్రశ్నించట్లేదా?' అని అనుష్క శర్మను ఓ అభిమాని అడగ్గా.. 'లేదు. ఎవరూ నన్ను ఆగడట్లేదు. సోషల్ మీడియాలో మాత్రమే అడుగుతున్నారు' అని ఆమె బదులిచ్చారు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు.

 బాటిల్ మూతలు తీయడానికి:

బాటిల్ మూతలు తీయడానికి:

లాక్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ నుంచి ఏవిధమైన సహాయం పొందుతున్నారని అనుష్క శర్మను ఒకరు ప్రశ్నించగా.. 'బాటిల్ మూతలు తీయడానికి, భారీ కుర్చీలు ఎత్తడానికి నేను విరాట్ సహాయం తీసుకుంటాను' అని చెప్పారు. 'నేను 2015 నుండి శాకాహారిగా మారాను. ఇది నా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయాలలో ఒకటి' అని మరోకరికి బదులిచ్చారు. తన తల్లి మంచి కుక్ అని, ఆమె చేసే మోమో మరియు పానీ పూరి ఇష్టంగా తింటానని అనుష్క చెప్పారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. షారుక్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా.. ఆశించిన మేర ఆడలేదు. ఆపై 'అంగ్రేజీ మీడియం'లో అతిథిగా పాత్ర పోషించారు.

ఏది తిన్నా కొలిచే:

ఏది తిన్నా కొలిచే:

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఆహారం విషయంలోనూ కఠినంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అతను ఏది తిన్నా కొలిచే తింటాడు. మరోవైపు అనుష్క కూడా భర్త ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వంటగదిలో బరువును కొలిచే మిషన్‌పై తినే పదార్థంను పెట్టి అది సరిగ్గా వంద గ్రాములు ఉండేలా చూసుకుంటారు. 'ఈ ఇంట్లో ఇలా కొలిచి తింటాం. దానికి కారణం కోహ్లీ' అని ఇటీవల అనుష్క వ్యాఖ్య జత చేశారు.

ఐపీఎల్‌ 2020.. ఐదు రోజులకోసారి ఆటగాళ్లకు కరోనా పరీక్షలు!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 5, 2020, 11:13 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X