మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 2015 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా ఐదోసారి ప్రపంచ కప్ ట్రోఫీ ఎగరేసుకుపోయింది. 1987, 1999, 2003, 2007లలో ప్రపంచ కప్ గెలిచిన ఆసిస్.. 2015లో గెలిచి అత్యధిక సార్లు కప్ గెలిచిన రికార్డ్ (ఐదుసార్లు) సృష్టించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆసిస్ సారథి మైకెల్ క్లార్క్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఫైనల్లో క్లార్క్ కెప్టెన్స్ ఇన్నింగ్ ఆడాడు. 84 బంతుల్లో 74 పరుగులు చేశాడు.
దీంతో కివీస్ తమ ముందు ఉంచిన స్వల్ప (184) పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ కేవలం 33.1 ఓవర్లలో చేధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్ 183 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించే క్రమంగా మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
1987లో అలెన్ బోర్డర్ సారథ్యంలో ఆసిస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పైన గెలిచింది. 1999లో స్టీవా సారథ్యంలో లార్డ్స్‌లో పాకిస్తాన్ పైన 8 వికెట్ల తేడాతో గెలిచింది. 2003, 2007లలో రికీ పాంటింగ్ సారథ్యంలో.. జోహన్నస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో భారత్ పైన 125 పరుగుల తేడాతో (2003), ఓవల్‌లో 53 పరుగులతో శ్రీలంక పైన (2007)లో ఆసిస్ గెలిచింది.
2015 ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు వీరే...
1. మైకేల్ క్లార్క్ (సారథి)
2. డేవిడ్ వార్నర్
3. ఆరోన్ ఫించ్
4. స్టీవ్ స్మిత్
5. షేన్ వాట్సన్
6. గ్లెన్ మాక్సువెల్
7. బ్రాడ్ హాడిన్ (వికెట్ కీపర్)
8. జేమ్స్ ఫాల్కనర్
9. మిచెల్ స్టార్క్
10. మిచెల్ జాన్సన్
11. హోజిల్ వుడ్
12. జార్జ్ బెయిలీ (వైస్ కెప్టెన్)
13. దోహార్తీ
14. పాట్ కుమిన్స్
15. మిచెల్ మార్ష్
కోచ్ - డారెన్ లెహమాన్