Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ టెస్టుకు లంక జట్టులో మార్పు: హెరాత్‌ స్థానంలో జెఫ్రీ

Herath ruled out of third Test. Vandersay roped in as cover

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 2 నుంచి జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనున్న ఈ టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జెఫ్రీ వెండెర్సేను జట్టులోకి తీసుకున్నారు.

రంగనా హెరాత్ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా అతడు మూడో టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక, జెఫ్రీ ఇప్పటివరకు శ్రీలంక తరుపున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. లంక తరుపున కేవలం 11 వన్డేలు, 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా, నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని శ్రీలంక భావిస్తుండగా 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

శ్రీలంక ఇప్పటివరకు భారత్‌లో భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవని సంగతి తెలిసిందే. ఈ పర్యటనలోనైనా టెస్టు గెలిచి చరిత్ర సృస్టించాలని దినేశ్‌ చండీమాల్‌ నేతృత్వంలోని జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. మరి చివరి టెస్టు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 29, 2017, 10:03 [IST]
Other articles published on Nov 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+