14వ బౌలర్: 400 వికెట్ల క్లబ్‌లో ఇప్పటివరకు ఎవరెవరు?
హైదరాబాద్: శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ అరుదైన ఘనత సాధించాడు. అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో హెరాత్ (6/43) ధాటికి 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 114 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో స్పిన్నర్ రంగనా హెరాత్ కెరీర్‌లో 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
84 టెస్టుల్లో 27.82 యావరేజితో హెరాత్ ఈ వికెట్లను సాధించడం విశేషం. అంతేకాదు ఈ మైలురాయి చేరుకున్న తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బౌలర్‌గా నిలిచాడు. మురళీధరన్, వార్న్, కుంబ్లే, హర్భజన్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న ఐదో స్పిన్నర్.
పాకిస్థాన్‌పై వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హెరాత్ మరో రికార్డు సృష్టించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వసారి. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లు 7 సార్లు మాత్రమే ఈ ఘతన సాధించారు. టెస్టుల్లో 9 సార్లు పది వికెట్లను(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) తీశాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే:

ముత్తయ్య మురళీ ధరన్
శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు తీసి ఎవరికి అందనంత ఎత్తులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

షేన్ వార్న్
ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

అనిల్ కుంబ్లే
భారత్‌కు చెందిన అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసి మూడో స్ధానంలో ఉన్నాడు.

గ్లెన్ మెక్‌గ్రాత్
ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ 124 టెస్టుల్లో 563 వికెట్లు తీశాడు.

కోట్నీ వాల్ష్
వెస్టిండిస్‌కు చెందిన కోట్నీ వాల్స్ 132 టెస్టుల్లో 519 వికెట్లు తీశాడు.

జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ 119 టెస్టుల్లో 463 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తరుపున ఈ రికార్డు సాధించిన ఫాస్ట్ బౌలర్ ఇతడే.

కపిల్ దేవ్
భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు తీశాడు.

రిచర్డ్ హ్యాడ్లీ
న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ హ్యాడ్లీ 86 టెస్టుల్లో 431 వికెట్లు తీశాడు.

షాన్ పొల్లాక్
దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పొల్లాక్ 108 టెస్టుల్లో 421 వికెట్లు తీశాడు.

హర్భజన్ సింగ్
భారత్‌కు చెందిన హర్భజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు తీశాడు.

డేల్ స్టెయిన్
దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ 84 టెస్టుల్లో 416 వికెట్లు తీశాడు.

వసీం అక్రమ్
పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీశాడు.

కోట్నీ ఆంబ్రోస్
వెస్టిండిస్‌కు చెందిన కోట్నీ ఆంబ్రోస్ 98 టెస్టుల్లో 405 వికెట్లు తీశాడు.

రంగనా హెరాత్
శ్రీలంకకు చెందిన రంగనా హెరాత్ 84 టెస్టుల్లో 400 వికెట్ల క్లబ్‌లో తీసి తాజాగా ఈ క్లబ్‌లో చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications