
ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 5 వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసుకుని జింబాబ్వేలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (8/63) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే ఓపెనర్లు మొదలుకొని టెయిలెండర్ల వరకూ హెరాత్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్నారు.

రెండో టెస్టులో 13 వికెట్లు
జింబాబ్వే ఆటగాళ్లలో ఎర్విన్(72), విలియమ్స్(45) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 13 వికెట్లు తీసుకున్న రంగనా హెరాత్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులకే ఆలౌట్ కాగా, జింబాబ్వే 272 ఆలౌటైంది.

ఈ సిరిస్‌లో మొత్తం 19 వికెట్లు
ఇక రెండో ఇన్నింగ్స్‌ను శ్రీలంక 258/9 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 233 పరుగులకే ఆలౌటైంది. ఈ సిరిస్‌లో రంగనా హెరాత్ మొత్తం 19 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సిరిస్‌లో హెరాత్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టుల్లో మురళీధరన్ తర్వాత వేగంగా 350 వికెట్ల మార్కును చేరుకున్న రెండో లంక స్పిన్నర్‌గా హెరాత్ రికార్డు సృష్టించాడు.

8 వికెట్లు తీసిన రెండో బౌలర్
75 టెస్టుల్లో హెరాత్ ఈ మార్కును చేరుకున్నాడు. జింబాబ్వే గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు (13) తీసిన బౌలర్‌గానూ హెరాత్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇర్ఫాన్ పఠాన్ (12/152, 2005లో) పేరిట ఉంది. అదేవిధంగా కెప్టెన్‌గా ఓ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా హెరాత్ నిలిచాడు. గతంలో 1985లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై కెప్టెన్‌గా కపిల్‌దేవ్ (8/106) ఈ ఘనత సాధించాడు.


Click it and Unblock the Notifications











