అరుదైన ఘనత: చరిత్ర సృష్టించిన లంక స్పిన్నర్ హెరాత్
హైదరాబాద్: శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ అరుదైన ఘనత సాధించాడు. అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో హెరాత్ (6/43) ధాటికి 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 114 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో స్పిన్నర్ రంగనా హెరాత్ కెరీర్‌లో 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
84 టెస్టుల్లో 27.82 యావరేజితో హెరాత్ ఈ వికెట్లను సాధించడం విశేషం. అంతేకాదు ఈ మైలురాయి చేరుకున్న తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బౌలర్‌గా నిలిచాడు. మురళీధరన్, వార్న్, కుంబ్లే, హర్భజన్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న ఐదో స్పిన్నర్.

పాకిస్థాన్‌పై వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా
పాకిస్థాన్‌పై వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హెరాత్ మరో రికార్డు సృష్టించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వసారి. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లు 7 సార్లు మాత్రమే ఈ ఘతన సాధించారు. టెస్టుల్లో 9 సార్లు పది వికెట్లను(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) తీశాడు.

ఓటమి తప్పదనుకున్న శ్రీలంక అనూహ్య విజయం
ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమి తప్పదనుకున్న శ్రీలంక.. అనూహ్య విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 69/4తో ఐదో రోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మరో 69 రన్స్ జోడించి 138 వద్ద ఆలౌటైంది. యాసిర్ షా 5, మహ్మద్ అబ్బాస్ 2 వికెట్లు తీశారు.

114 పరుగులకే ఆలౌటైన పాకిస్థాన్
అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ హెరాత్ ధాటికి పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ టాపార్డర్‌లో ఓపెనర్లు షాన్ మసూద్ (7), సమీ అస్లాం (2)తో పాటు అజర్ అలీ (0), బాబర్ ఆజమ్ (3) ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో అసద్ షఫీక్ (20), హారిస్ సొహైల్ (34), కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (19) పోరాడినా ఓటమి తప్పలేదు.

తొలి టెస్టులో మొత్తం 11 వికెట్లు తీసిన హెరాత్
హెరాత్‌తో పాటు దిల్‌రువాన్ పెరీరా 3 వికెట్లు తీశాడు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులు చేయగా, పాక్ 422 పరుగులు సాధించింది. ఈ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీసిన హెరాత్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఈ నెల 6న ఆఖరి, రెండో టెస్ట్ మొదలు కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications