For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెల్మెట్‌కు తగిలిన బంతి.. బౌలర్‌కు చుక్కలు చూపించిన శ్రేయస్! (వీడియో)

విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకుని అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ తన దూకుడు తగ్గలేదని నిరూపించాడు.

మైదానంలో ఏం జరిగిందంటే?
జైపూర్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగానే పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ ఓ పదునైన బౌన్సర్‌తో స్వాగతం పలికారు. ఆ బంతిని అంచనా వేయడంలో శ్రేయస్ అయ్యర్ విఫలం కావడంతో అది నేరుగా వెళ్లి అతని హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఫిజియో వచ్చి శ్రేయస్ అయ్యర్‌ను పరీక్షించారు.

Helmet Hit Six Next Ball Shreyas Iyer Fearless Reply in Vijay Hazare Trophy

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్లు కొంత తడబడతారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తగ్గేదే లేదన్నట్లు మరుసటి బంతికే సిద్ధమయ్యారు. గుర్నూర్ బ్రార్ మళ్లీ అదే వేగంతో షార్ట్ పిచ్ బంతిని విసరగా.. ఈసారి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పుల్ షాట్‌తో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "మొదటి బంతి నాకు కనిపించలేదు, రెండో బంతి నీకు కనిపించదు" అనే రేంజ్‌లో క్యాప్షన్ ఇచ్చింది.

లో స్కోరింగ్ థ్రిల్లర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ శర్మ(8) నిరాశపర్చగా.. అన్మోల్ ప్రీత్ సింగ్(57), రమణ్‌దీప్ సింగ్(72) అర్థశతకాలతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్(3/37) మూడు వికెట్లు తీయగా.. శశాంక్, శివమ్ దూబే, ఓంకార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సాయిరాజ్ పాటిల్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/57), మయాంక్ మార్కండే(4/31) నాలుగేసి వికెట్లతో ముంబై పతనాన్ని శాసించారు. హర్‌ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ తలో వికెట్ తీసారు..

శ్రేయస్ అయ్యర్ ఫామ్ భారత్‌కు కీలకం
ఆస్ట్రేలియా పర్యటనలో వెన్నునొప్పితో బాధపడిన శ్రేయస్ అయ్యర్, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. అయితే, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ ఇలా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూల అంశం. షార్ట్ పిచ్ బంతులపై గతంలో విమర్శలు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం గమనార్హం.

Story first published: Friday, January 9, 2026, 8:41 [IST]
Other articles published on Jan 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+