మ్యాచ్ పోతే పోయింది గానీ భయ్యా.. అదొక్కటీ
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో దాదాపుగా ఒక అడుగు వేసింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై సాధించిన అద్భుతమైన 82 పరుగుల విజయం GTకి కీలకమైన 16 పాయింట్లను తెచ్చిపెట్టింది. 12 మ్యాచ్‌లలో 16 పాయింట్స్‌ను ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే మ్యాజిక్ నంబర్‌గా పరిగణిస్తారు. ఈ గెలుపుతో ఇతర జట్ల ప్లేఆఫ్స్ అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సాకీబ్ హుస్సేన్ (2/37), ప్రఫుల్ హింగే (2/17), పాట్ కమిన్స్ (1/20) వికెట్లు పడగొట్టారు.

ఛేదించదగ్గ టార్గేటే అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. పాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ అంటే మిగిలిన బ్యాటర్లు ఏ స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. హెన్రిచ్ క్లాసెన్ సహా బ్యాటర్లందరూ విఫలం అయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా, జేసన్ హోల్డర్ మూడేసి వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించారు. ప్రసిధ్ కృష్ణ- 2, సిరాజ్, రషీద్ ఖాన్‌కు చెరో వికెట్ కూల్చారు.
14 పరుగులతో మిస్టర్ డిపెండబుల్ క్లాసెన్ అవుట్ కావడంతోనే పరాజయం ఖాయమైంది. అతని తర్వాత పాట్ కమ్మిన్స్ మాత్రమే కొంత ప్రతిఘటించగలిగాడు. నితీష్ కుమార్ రెడ్డి రెండు పరుగులతో సరిపెట్టుకున్నాడు. అతనితో పాటు కమ్మిన్స్- 19, సలీల్ అరోరా- 16 ఇషాన్ కిషన్- 11 మాత్రమే డబుల్ డిజిట్ అందుకున్నారు.
ఈ మ్యాచ్ లో విఫలమైనప్పటికీ ఆరెంజ్ క్యాప్ ఛార్ట్ లో సన్ రైజర్స్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. క్లాసెన్ టాప్ లో ఉన్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో 153.93 స్ట్రైక్ రేట్‌తో 508 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ 12 ఇన్నింగ్స్‌లు, 155.10 స్ట్రైక్ రేట్ తో 501 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 ఇన్నింగ్స్‌లు, 209.13 స్ట్రైక్ రేట్ తో 481, కేఎల్ రాహుల్- 477, శుభ్‌మన్ గిల్- 467 పరుగులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications