For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లాసెన్ ఊచకోత.. ఫైనల్‌లో సన్‌రైజర్స్ X సూపర్ జెయింట్స్ (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)-2024 అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో తలపడే జట్టేదో తేలింది. క్వాలిఫయిర్-2లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై డర్బన్ సూపర్ జెయింట్స్ విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (74; 30 బంతుల్లో, 3x4, 7x6) విధ్వంసంతో సూపర్ జెయింట్స్ 69 పరుగుల తేడాతో నెగ్గింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 211 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రీట్జ్‌కీ (12; 10 బంతుల్లో), డికాక్ (23; 17 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. కానీ స్వల్పవ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. వన్‌డౌన్‌‌లో వచ్చిన స్మట్స్ (11; 12 బంతుల్లో) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్, రజపక్స (35; 23 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Heinrich Klaasen Massacre innings helped Super Giants into SA20 Final

కానీ 13వ ఓవర్ మొదటి బంతికే రజపక్స ఔటయ్యాడు.అప్పటికీ 12.1 ఓవర్లకు జెయింట్స్ స్కోరు 95/4 మాత్రమే. ఆ తర్వాత క్లాసెన్ ఊచకోత మొదలుపెట్టాడు. అతడికి తోడుగా వియాన్ మల్డర్ (50*; 23 బంతుల్లో) విధ్వంసం స‌ృష్టించాడు. దీంతో వీరిద్దరు 36 బంతుల్లోనే శతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్ ఔటైనప్పటికీ మల్డర్ ఆఖరి వరకు క్రీజులో ఉండి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్, బ్రాస్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. ఆదిలోనే కెప్టెన్ డుప్లెసిస్ (3; 7 బంతుల్లో) ఔటయ్యాడు. ఆ తర్వాత డుప్లూయ్ (10; 7 బంతుల్లో), మఖాన్య (11; 8 బంతుల్లో) కూడా పెవిలియన్‌కు చేరడంతో 32 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్ అలీ (30; 26 బంతుల్లో)తో కలిసి హెండ్రిక్స్ (27; 24 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ దూకుడు పెంచే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఫెరీరా (24; 12 బంతుల్లో), బ్రాస్‌వెల్ (23; 12 బంతుల్లో) హిట్టింగ్‌తో ఓటమి అంతరాన్ని తగ్గించారు. సూపర్ జెయింట్స్ బౌలర్లో జూనియర్ దలా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. నవీనుల్, ప్రిటోరియస్ చెరో రెండు వికెట్లు తీశారు. సన్‌రైజర్స్, సూపర్ జెయింట్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

Story first published: Friday, February 9, 2024, 9:42 [IST]
Other articles published on Feb 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+