Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గురువు గారికి వందనాలు.. !!

ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరిస్థితి అధ్వాన్నం. ఏదీ కలిసి రావట్లేదు. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ లల్లో నాలుగింట్లో ఓడింది. నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లల్లో విజయాలు సాధించి గాడినపడిందనుకునే లోపే సన్ రైజర్స్ హైదరాబాద్ రూపంలో భారీ అడ్డంకి ఎదురొచ్చింది. దీన్ని అధిగమించలేక చతికలిపడిందా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. అటు ధోనీ కూడా అందుబాటులో ఉండట్లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రతి మ్యాచ్ కూ దాటవేస్తోన్నాడు.

అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. యంగ్ స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే జట్టుకు దూరం అయ్యాడు. చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఇతనొక్కడే. హామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. మొదట్లో మూడు వారాల పాటు అందుబాటులో ఉండబోడని భావించినప్పటికీ.. అది రివర్స్ అయింది. మాత్రేకు స్కానింగ్ తీయించగా.. గాయం తీవ్రత తెలిసివచ్చింది. రెండు నెలల పాటు అతనికి విశ్రాంతి అవసరమని తేల్చారు.

Heartwarming Moment Deepak Chahar Touches Dhoni s Feet During CSK before Mumbai Indians match

ఈ పరిస్థితుల మధ్య గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తలపడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్‌ నాటికి ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ అందుబాటులోకి వస్తారని అంచనా. దీనికి అనుగుణంగా ధోనీ మంగళవారం రాత్రి వాంఖడేలో నెట్స్‌లో కనిపించాడు. అరగంట కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 44 ఏళ్ల ధోని కండరాల గాయం నుండి కోలుకుని, ఇప్పుడిప్పుడే ధారాళంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లను ఆడిన సీఎస్కే రెండింట్లో మాత్రమే గెలిచింది. నాలుగింట్లో ఓడి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ధోని తిరిగి రావడం ఆ జట్టు బ్యాటింగ్‌కు బలం చేకూరుస్తుంది. ఇంగ్లాండ్ స్టార్ విల్ జాక్స్ కూడా అందుబాటులో ఉన్నాడు. తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన అతను.. సోమ, మంగళవారాల్లో వాంఖడేలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. గంటపాటు బౌలింగ్, బ్యాటింగ్ చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో మెరిసిన విల్ జాక్స్ రాక ముంబై ఇండియన్స్ పెద్ద బలం.

కాగా- నెట్ ప్రాక్టీస్ లో ఉన్న ధోనీని సీఎస్కే మాజీ పేస్ బౌలర్ దీపక్ చాహర్ కలిశాడు. ధోని పాదాలకు నమస్కరించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధోని నాయకత్వంలో చాహర్ చాలాకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ సమయంలో ధోనీ సూచనలు అతనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ధోనీని గాడ్ ఫాదర్ గా భావిస్తాడు చాహర్. కలిసిన వెంటనే కాళ్లకు నమస్కరించాడు. భక్తిప్రపత్తులను చాటుకున్నాడు.

Story first published: Wednesday, April 22, 2026, 11:13 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+