For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20WC: ఫైనల్లో మరోసారి ఓటమి.. కన్నీటితో దక్షిణాఫ్రికా అమ్మాయిలు (Video)

మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్ దేశానికి పురుషుల క్రికెట్ లేదా మహిళల క్రికెట్‌లో ఇదే మొదటి పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్. ఓవరాల్‌గా కివీస్ అమ్మాయిలకు ఇది రెండో ప్రపంచకప్. 2000 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది.

మరోవైపు దక్షిణాఫ్రికా అమ్మాయిలకు టీ20 కప్ చేజారడం వరుసగా ఇది రెండో సారి. 2023 టీ20 ప్రపంచకప్‌లోనూ సౌతాఫ్రికా టైటిల్ పోరుకు చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్‌ను చేజార్చుకుంది. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా తుదిమెట్టులో కప్‌ను కోల్పోవడం రెండోసారి. పురుషుల క్రికెట్‌ టీ20 కప్‌ ఫైనల్‌లో కూడా సఫారీలు ఓటమిపాలయ్యారు.

Heartbreak for South Africa Players in Tears After Falling Short Against New Zealand in Women s T20 World Cup Final

ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా అమ్మాయిలు భావోద్వేగానికి గురయ్యారు. ఓటమి బాధతో తమ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మైదానంలోనే ఎమోషనల్ అయ్యారు. మరోసారి ఛోకర్స్‌గా మిగిలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 158 పరుగులు చేసింది. అమేలియా కెర్‌ (43; 38 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్.బ్రూక్ హాలీడే (38; 28 బంతుల్లో, 3 ఫోర్లు), సుజీ బేట్స్ (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలాబా రెండు వికెట్లు, అయబోంగా ఖకా, ట్రయాన్‌, డిక్లెర్క్‌, సున్‌ లుజ్‌ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్లకు 126 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ వోల్వార్ట్ (33; 27 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోర్. అయితే దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. వోల్వర్ట్-తజ్మిన్ కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (51) భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వీరిద్దరు కలిసి పవర్‌ప్లేలో 47 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత ఒత్తిడికి చిత్తయ్యారు. రోజ్‌మేరీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు, బ్రూక్‌ హాలీడే , కార్సన్‌ తలో వికెట్ తీశారు.

Story first published: Monday, October 21, 2024, 8:20 [IST]
Other articles published on Oct 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+