వరల్డ్ టీ20: హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు నెలకొల్పిన హీలే

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 టోర్నీలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి గుయానా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పెర్రీ 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఐర్లాండ్ నిర్దేశించిన 94 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మహిళల జట్టు 9.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

హాఫ్ సెంచరీతో సత్తా చాటిన హీలే
ఆసీస్ బ్యాట్స్‌ఉమెన్‌లో అలైస్సా హీలే(56 నాటౌట్, 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో అలైస్సా హీలే కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించింది. తద్వారా టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది.

అగ్రస్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్ ఉమెన్
ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ సోఫాయి డివైని(18 బంతుల్లో హాఫ్ సెంచరీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజా విజయంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు గ్రూప్-బీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ విజయం ఆస్ట్రేలియా మహిళల జట్టుకు 11వ విజయం కావడం విశేషం.

ఆసీస్ ఖాతాలో అరుదైన ఘనత
దీంతో వరుసగా పది, అంతకంటే ఎక్కువ విజయాల్ని రెండోసారి నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు నిలిచింది. 2014లో ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 16 విజయాలు సాధించింది. దీంతో టీ20ల్లో అత్యధికంగా వరుస విజయాల్ని నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది.

నవంబర్ 13న న్యూజిలాండ్‌తో తలపడనున్న ఆసీస్
మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జాబితాలో ఇంగ్లాండ్(14) రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్(12) మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా నవంబర్ 13న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్ పాకిస్థాన్‌తో తలపడతుండగా, ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications