Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది నిజంగానే జరిగింది: 'హెడ్‌మాస్టర్' ముద్రపై కుంబ్లే

హైదరాబాద్: భారత క్రికెట్‌లో క్రమశిక్షణకు మారుపేరైన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే ఒకడు. జట్టులో, ఆ తర్వాత కోచ్‌గా పని చేసిన సమయంలో కూడా ఇదే కుంబ్లేని ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. తాజాగా అనిల్ కుంబ్లే 'హెడ్‌మాస్టర్‌' లాగా వ్యవహరిస్తున్నాడని, అదే తరహాలో శిక్షణ కూడా ఇస్తున్నాడని అనిపించుకుని జట్టు ప్రధాన కోచ్‌ పదవిని కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టులో మెజారిటీ ఆటగాళ్లకు కుంబ్లే వైఖరి నచ్చలేదని, అతను హెడ్‌మాస్టర్‌ లాగా వ్యవహరిస్తున్నట్లుగా ఆటగాళ్లు అభిప్రాయపడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు జట్టులోని ఆటగాళ్లు 'హెడ్‌మాస్టర్‌' అనే ముద్ర వేయడాన్ని కుంబ్లే బాగానే గుర్తుంచుకున్నట్లున్నాడు.

 హెడ్‌మాస్టర్ వ్యాఖ్యలపై కుంబ్లే

హెడ్‌మాస్టర్ వ్యాఖ్యలపై కుంబ్లే

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పుస్తకం ‘హిట్‌ రిఫ్రెష్‌'కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అనిల్ కుంబ్లే వివిధ అంశాలపై స్పందించాడు. ఈ సమయంలో ఈ హెడ్‌మాస్టర్ వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'ఆత్మవిశ్వాసం అనేది నాకు వారసత్వంగానే వచ్చింది. మనల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలాంటి వారు మనకు నేర్పే విలువల నుంచి ఇది వస్తుంది' అని కుంబ్లే అన్నాడు.

 మా తాత స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేశాడు

మా తాత స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేశాడు

'మా తాత స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేశాడు. హెడ్‌మాస్టర్‌ అనే పదం నా కెరీర్‌ తర్వాతి రోజుల్లో నాతో జత చేరుతుందని నాకు బాగా తెలుసు. అది నిజంగానే జరిగింది. ఇక్కడున్న వాళ్లకు నేనేం మాట్లాడుతున్నానో తెలుసు' అని కుంబ్లే వ్యాఖ్యానించగానే అక్కడున్న వాళ్లందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి.

2003-04 నాటి ఆసీస్ సిరిస్ అతి పెద్ద సవాల్

2003-04 నాటి ఆసీస్ సిరిస్ అతి పెద్ద సవాల్

తన కెరీర్లో అతి పెద్ద సవాలుగా నిలిచిన పర్యటన 2003-04 నాటి ఆస్ట్రేలియాతో సిరీసే అని కుంబ్లే ఈ సందర్భంగా చెప్పాడు. 'ఆ సిరీస్‌లో నా కెరీర్‌ డోలాయమాన స్థితికి చేరుకుంది. నేను తుది జట్టులో చోటు కోసం (హర్భజన్‌తో) పోటీ పడాల్సి వచ్చింది. అప్పటికి 30వ పడిలో ఉండటంతో నా రిటైర్మెంట్‌ గురించి వార్తలు వచ్చాయి' అని కుంబ్లే అన్నాడు.

 అప్పుడే గూగ్లీ ప్రయోగించా

అప్పుడే గూగ్లీ ప్రయోగించా

'అలాంటి స్థితిలో అడిలైడ్‌ టెస్టులో ఆడే అవకాశం కలిగింది. నేనేదైనా కొత్తగా చేయాల్సిన అవసరముందని గుర్తించి టెన్నిస్‌ బంతితో ఆడే రోజుల్లో ప్రయత్నించిన గూగ్లీని ప్రయోగించాను. ఆటను మెరుగుపరుచుకోవడానికి మార్పులు అవసరమని అప్పుడే గ్రహించాను' అని కుంబ్లే తెలిపాడు.

 కెరీర్‌ మళ్లీ గాడిలో పడింది

కెరీర్‌ మళ్లీ గాడిలో పడింది

అడిలైడ్‌ టెస్టులో తాను బాగా ఆడటంతో పాటు భారత్‌ గెలవడంతో తన కెరీర్‌ మళ్లీ గాడిలో పడిందని కుంబ్లే చెప్పాడు. భారత క్రికెట్‌లో 1983 వన్డే వరల్డ్‌ కప్‌ విజయం, 2001లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌‌లు అత్యుత్తమ ఘట్టాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+