ENGvsPAK: ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు.. పాక్‌పై ఇంగ్లండ్ రికార్డు ఎలా ఉందంటే?

టీ20 ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించి, సెమీఫైనల్‌లో ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు సాధించిన ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో చివరకు ట్రోఫీని జోస్ బట్లర్, బాబర్ ఆజమ్ ఎవరు ముద్దాడుతారని ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీ20 క్రికెట్‌లో..
ఇంగ్లండ్, పాకిస్తాన్ రెండు జట్లు కూడా పొట్టి ఫార్మాట్‌లో బలంగానే ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు తలపడినప్పుడు మాత్రం ఎక్కువ సార్లు ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడాయి. వీటిలో 18 మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 8 మ్యాచుల్లోనే గెలిచింది. ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఈ రెండు జట్లు చివరగా తలపడిన మ్యాచ్‌లో పాక్ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఇంగ్లండ్.. 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో బాబర్ సేన చతికిల పడటంతో ఆ మ్యాచ్‌ను ఇంగ్లండ్ జట్టు 67 పరుగుల తేడాతో గెలుచుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో..
కేవలం ఈ ఫార్మాట్‌లోనే కాదు.. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌దే పైచేయి. ఈ రెండు జట్లు 2009లో ఒకసారి, 2010లో ఒకసారి టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ రెండు సార్లూ విజయం ఇంగ్లండ్‌నే వరించింది. మరి ముచ్చటగా మూడోసారి కూడా ఇంగ్లండ్ గెలిస్తే ఈసారి విజయంతో పాటు ట్రోఫీ కూడా ఆ జట్టుకే దక్కుతుంది.

ఇంగ్లండ్‌లో..
చివరగా స్వదేశంలో పాకిస్తాన్‌తో ఆడిన ఐదు టీ20 మ్యాచుల్లో కూడా ఇంగ్లండ్‌కే మెరుగైన రికార్డు ఉంది. ఈ ఐదు మ్యాచుల్లో ఇంగ్లండ్ జట్టు మూడింట విజయం సాధించింది. వీటిలో మూడు మ్యాచులు గతేడాదే జరిగాయి. వీటిలో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 31 పరుగుల తేడాత విజయం సాధించగా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది.

పాకిస్తాన్‌లో..
పాక్ గడ్డపై కూడా ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఇంగ్లండ్ జట్టే పైచేయి సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను ఇంగ్లండే గెలుచుకుంది. చివరగా పాక్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచుల్లో పాకిస్తాన్ రెండింట మాత్రమే గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications