Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దినేష్ కార్తీక్ ఫినిషర్‌గానే, హార్దిక్ విషయంలో చెప్పేదేమీ లే.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రావిడ్ జవాబులివే

Head Coach Rahul Dravid conducted Press Conference ahead of southafrica series, and reveal some key points.

టీమిండియా గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియా సభ్యులు మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌ నిర్వహించింది. ఇకపోతే ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచి జట్టులోకి వచ్చిన కొత్తవాళ్లపై, అలాగే గతంలో జట్టుకు దూరమై తిరిగి జట్టులోకి చేరిన ప్లేయర్లపై బాగా ఫోకస్ ఉంది. ఇక ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు టైటిల్‌ అందించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత హార్దిక్ తొలిసారిగా భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇకపోతే ఐపీఎల్లో ట్రోఫీ గెలిపించిన అతని నాయకత్వ పటిమపై కూడా చర్చ నడుస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ ప్లేయింగ్ 11 ఎవరనేది మాత్రం ద్రావిడ్ రివీల్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేశాడు.

లీడర్ షిప్‌లో ఉండాలంటే హార్దిక్‌ను లీడర్‌గా ప్రకటించాలిగా..!

లీడర్ షిప్‌లో ఉండాలంటే హార్దిక్‌ను లీడర్‌గా ప్రకటించాలిగా..!

ఈ క్రమంలో ఈ సిరీస్‌కు ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్లో టైటిల్ విజయం అనంతరం హార్దిక్ పాండ్యా ఇప్పుడు లీడర్ షిప్ గ్రూప్‌లో ఉండే ప్లేయరా అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ద్రావిడ్ స్పందిస్తూ..'నేను కేవలం రెండు గంటల క్రితమే హార్దిక్‌ పాండ్యాను కలిశాను. ఐపీఎల్లో అతని కెప్టెన్సీ ఆకట్టుకునేలా ఉందని నేను కూడా ఏకీభవిస్తున్నాను. అతను ఐపీఎల్లో అదిరిపోయేలా ఆడాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే.. ఏ లీడర్ షిప్ గ్రూప్‌లోనైనా లీడర్ కావాలంటే రెస్పెక్టెడ్ అథారిటీ అతన్ని లీడర్‌గా నియమించాలి.' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

 హార్దిక్ పాండ్యా నుంచి మాకు కావాల్సింది అదే

హార్దిక్ పాండ్యా నుంచి మాకు కావాల్సింది అదే

'మున్ముందు ఏం జరుగుతుందో ఎవరం చెప్పగలం. ఎవరైనా జట్టుకు నాయకత్వం వహించాలా వద్దా అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సెలక్టర్లు వివిధ కోణాల్లో గమనించి ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. టీమిండియా భవిష్యత్తు, మెరుగై ఆటగాళ్ల లభ్యత ఆధారంగా వారో నిర్ణయం తీసుకుంటారు. ఎవరినీ కెప్టెన్ చేయాలో వారు చూసుకుంటారు. ఇక హార్దిక్ పాండ్యా విషయంలో తాము చెప్పేదేమీ లేదు. అతను మళ్లీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తద్వారా జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఒక క్రికెటర్‌గా అతని బౌలింగ్‌, అతని బ్యాటింగ్‌ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

 ఐపీఎల్ పుణ్యమా అని ఇంత మంది కెప్టెన్లు

ఐపీఎల్ పుణ్యమా అని ఇంత మంది కెప్టెన్లు

'ఇక ఐపీఎల్‌ పుణ్యమా అని చాలా మంది టీమిండియా ప్లేయర్లు కెప్టెన్లుగా బాగా రాణిస్తున్నారు. వారిలో హార్దిక్ ఒకరు. కేఎల్ రాహుల్ కూడా లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి కెప్టెన్సీ వహించాడు. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రాణించాడు. కేకేఆర్‌కు శ్రేయాస్ కెప్టెన్సీ చేసాడు. ఐపీఎల్ వల్ల మంచి మంచి ఆటగాళ్లు వెలుగు చూడడమే కాకుండా.. వాళ్లు ఎదగడానికి మరిన్ని స్కిల్స్ పెంచుకోవడానికి సహాయపడుతుంది. కెప్టెన్లు కూడా తయారవుతున్నారు' అని ద్రావిడ్ తెలిపారు.

రోహిత్ శర్మ ప్రతిసారి ఆడాలనుకోవద్దు

రోహిత్ శర్మ ప్రతిసారి ఆడాలనుకోవద్దు

ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రావిడ్ ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్ పటిమను కొనియాడాడు. అతను రోజురోజుకు మెరుగుపడుతున్నాడని, అయితే అతను నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక రోహిత్ కు విశ్రాంతి ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. రోహిత్ అన్ని ఫార్మాట్ల ఆటగాడు. ఇక అతను ప్రతిసారి అందుబాటులో ఉండాలని ఆశించడం అవివేకం. వారు కూడా ఫిట్‌గా, తాజాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన సందర్భాలు కూడా వస్తాయి అని పేర్కొన్నాడు.

 దినేష్ కార్తీక్ రోల్ ఏంటో మాకు తెలుసు

దినేష్ కార్తీక్ రోల్ ఏంటో మాకు తెలుసు

ఇక కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ పట్ల మాట్లాడుతూ.. మేము ఇన్నింగ్స్‌లో మంచి ప్రారంభాల కోసం చూస్తున్నాం. మాకు మా టాప్ 3 పటిష్టంగా ఉందని తెలుసు. ఎక్కువ స్కోరింగ్ గేమ్‌లలో వారు మంచి స్ట్రైక్ రేట్‌ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. కానీ అప్పుడప్పుడు లో స్కోరింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఏదేమైనా మాకు మంచి టాప్ 3 బ్యాటర్లు ఉన్నారు. ఇక దినేష్ కార్తీక్ తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషిస్తున్నా. మాకు దినేష్‌ కార్తీక్ పాత్ర ఏంటో స్పష్టత ఉంది. ఫినిషింగ్లో అతను సత్తా చూపగలడు. అందుకే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు.

Story first published: Tuesday, June 7, 2022, 20:03 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+