Rishabh Pant Chances for T20 World cup Squad: పంత్ ఎందుకు ఉండడు, ఉంటడు ఉంటడు.. ద్రావిడ్ వ్యాఖ్యలు

2022 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో రిషబ్ పంత్‌కు అవకాశం దక్కుతుందా దక్కదా అనే విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో రిషబ్ పంత్ విమర్శల పాలయ్యాడు. దీంతో అతన్ని ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పటికీ సీనియర్ ఆటగాళ్లయిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి రాబోతుండడంతో వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్ ను కొనసాగించి పంత్‌కు ఉద్వాసన పలికే వీలుందని టాక్ నడుస్తోంది. ఇకపోతే భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్.. ప్రపంచ కప్ జట్టులో పంత్‌కు అవకాశం ఉంటుందా ఉండదా అనే విషయమై కీలక స్టేట్ మెంట్ ఇచ్చాడు.

తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేని ప్లేయర్ అంటూ..
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం వర్షం కారణంగా సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ రద్దు కావడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్ 2-2గా సమమైంది. ఇక ఈ సిరీస్లో పంత్ 58పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 105గా ఉంది.
ఇక అతని పరుగుల విషయం కంటే అతను ఔట్ అవుతున్నా తీరే అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. పదే పదే ఆఫ్ సైడ్ వైడ్ బాల్స్‌ను హిట్ చేయాలని చూస్తూ.. గాల్లోకి క్యాచ్ ఇచ్చి పంత్ ఔట్ అవుతున్నాడు.
దీంతో అతనో నిర్లక్ష్యకర బ్యాటర్ అని, తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేని ప్లేయర్ అని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా అతని కంటే బెటర్ బ్యాటర్ అయిన దినేష్ కార్తీక్ తుది జట్టులో ఉంటే నయమని చర్చల్లో పేర్కొంటున్నారు. దీంతో టీమిండియా టీ20 సెటప్‌లో పంత్ స్థానం విషయంలో కాస్త డైలామా కొనసాగుతుంది.

పంత్ అత్యంత కీలక ప్లేయర్
ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు కూర్పు ప్రణాళికలో పంత్ అత్యంత కీలకమైన ప్లేయర్ అని ద్రావిడ్ ఆదివారం స్పష్టం చేశాడు. వ్యక్తిగతంగా అతను మరికొన్ని పరుగులు చేయాల్సింది. కానీ అది అతని ఆటను నిర్ణయించే విషయం కాదు. కచ్చితంగా అతను రాబోయే కొద్ది నెలల్లో మా ప్రణాళికలలో చాలా పెద్ద భాగంగా ఉంటాడు' అని ద్రావిడ్ చివరి మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పాడు.
ఒక సిరీస్ ఆధారంగా పంత్ ఆటతీరును నిర్ణయించలేమని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో పంత్ క్యాలిబర్ ఉన్న ఆటగాడని అతని ప్రాముఖ్యం గురించి ప్రస్తావించాడు.

ఐపీఎల్ తరహా ఆట త్వరలోనే ఆడతాడు
'నేను విమర్శనాత్మక విధానంలో ఆటను పోల్చడానికి ఇష్టపడను. మనకు మిడిల్ ఓవర్లలో కొంచెం అటాకింగ్ బ్రాండ్ క్రికెట్ ఆడే ప్లేయర్ కావాలి. గేమ్‌ను కాస్త మూమెంటమ్‌తో తీసుకెళ్లగలగాలి. ఒక రెండు లేదా మూడు గేమ్‌ల ఆధారంగా అతనో నాసిరకమైన ప్లేయర్ అని అంచనా వేయడం చాలా కష్టం. ఐపీఎల్లో పంత్ స్ట్రైక్-రేట్ 158 ప్లస్‌గా ఉంది.
అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 340పరుగులు ఈ స్ట్రైక్ రేటుతో చేశాడు. అతను స్ట్రైక్-రేట్ పరంగా చాలా మంచి ఐపీఎల్ ప్రదర్శనను కలిగి ఉన్నాడని నేను భావిస్తున్నాను. మేము అతని నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా ఆ స్థాయి గణాంకాలను పొందగలమని ఆశిస్తున్నాము' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

కొన్ని సార్లు తప్పు చేయవచ్చు అంత మాత్రానా
'జట్టు బ్యాటింగ్లో ఉన్న పొజిషన్ బట్టి కొన్నిసార్లు ఆడే ఉద్దేశాన్ని చూడాలి. దాడి చేస్తూ ఆడాల్సిన టైంలో అతను కొన్ని గేమ్‌లలో తప్పు చేయవచ్చు, కానీ అతను మా బ్యాటింగ్ లైనప్‌లో అంతర్భాగంగా మిగిలిపోయాడు. అతని పవర్ హిట్టింగ్ గురించి మాకు మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ లైనప్లో అతనో నిఖార్సైన ఎడమ చేతి వాటం బ్యాటర్. ఈ విషయాన్ని మేము మరింత ప్రాధాన్యంగా గుర్తించాలి. మిడిల్ ఓవర్లలో చాలా సార్లు అతను మంచి నాక్స్ ఆడాడు' అని ద్రావిడ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications