సౌతాఫ్రికా పర్యటనలో భారత్ ఓటమిపై హెడ్ కోచ్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. టీమిండియా ఓటమిపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే సిరీస్‌లో ఓడడంతో విమర్శల పాలవుతున్న తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వెనుకేసుకు రావడమే కాకుండా.. ప్రస్తుతం జట్టులో ఉన్న లోపాల గురించి ద్రావిడ్ మాట్లాడాడు. వాటన్నింటిని ప్రపంచకప్ నాటికి సరి చేసుకుంటామని చెప్పాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లో కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

కనువిప్పు లాంటింది
సౌతాఫ్రికా పర్యటనలో తమకు ఎదురైన ఓటమి కనువిప్పు లాంటిదని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. టీమిండియా వన్డే క్రికెట్ ఆడి చాలా రోజులయిందన్న ఆయన.. గత ఏడాది మార్చిలో చివరగా ఇంగ్లండ్‌తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టు వరుసగా వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని తెలిపాడు. దీంతో ఈలోగా తమ లోపాలను సరిచేసుకుని ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు. అలాగే ఈ సిరీస్‌లో తమ రెగ్యులర్ ఆల్‌రౌండర్లు లేకపోవడం కూడా జట్టుకు మైనస్‌గా మారిందని ఆయన తెలిపాడు. 6, 7, 8 స్థానాల్లో ఆడాల్సిన వారు తిరిగి జట్టులో చేరితో టీం బలంగా తయారవుతుందని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మిడిల్ ఓవర్లలో రాణించాలి
‘‘మిడిల్ ఓవర్లలో మేము కచ్చితంగా మెరుగ్గా ఆడాల్సింది. 20-40 ఓవర్ల మధ్యలో మెరుగైన బ్యాటింగ్ కనబర్చాల్సింది. మిడిల్ ఓవర్లలో బాగా ఆడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిన రెండు సార్లు 290 పరుగులు సాధించింది. అవే మ్యాచ్‌ల్లో మేము 30వ ఓవర్ వద్ద మెరుగ్గా ఉండాల్సింది. కానీ మేము ఫేలవమైన షాట్లు ఆడడం వల్ల రాణించలేకపోయాం. ఈ సిరీస్ నుంచి మేము నేర్చుకోవల్సింది చాలా ఉంది.'' అని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.

కేఎల్ రాహుల్‌కు అండగా
ఇక ఈ సిరీస్‌లో తన ఫేలవమైన కెప్టెన్సీతో తీవ్ర విమర్శల పాలవుతున్న కేఎల్ రాహుల్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అండగా నిలిచాడు. కెప్టెన్‌గా రాహుల్ తన బాధ్యతను సమర్ధవంతంగా నేరవేర్చాడని చెప్పుకొచ్చాడు. రాహుల్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేస్తున్నాడని, రానున్న రోజుల్లో తనే నేర్చుకుంటాడని తెలిపాడు. అలాగే ఓడిపోయిన జట్టు వైపు ఉండడం అంత తేలిక కాదని చెప్పుకొచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లలోని మెరుగైన ప్రతిభను బయటికి తీసుకొచ్చి అవసరానికి తగ్గట్టు వినియోగించవడమే కాకుండా కెప్టెన్సీ గురించి నేర్చుకుంటాడని ద్రావిడ్ ధీమా వ్యక్తం చేశాడు.

చాహర్‌పై ప్రశంసలు
అలాగే మూడో వన్డేలో బ్యాట్‌తో, బంతితో రాణించిన దీపక్ చాహర్‌పై రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. చాహర్ శ్రీలంకలో, సౌతాఫ్రికాలో వచ్చిన అవకాశాలను బాగా వినియోగించుకున్నాడని ఆయన కొనియాడాడు. ఇండియా ఏ తరఫున కూడా చాహర్ బ్యాట్, బంతితో రాణించాడని తెలిపాడు. అలాగే రానున్న రోజుల్లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తామని ద్రావిడ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications